చంద్రబాబు సతీమణి గురించి ఎవరూ మాట్లాడింది లేదు; ఇది బాబు సానుభూతి డ్రామా: మంత్రి కన్నబాబు క్లారిటీ

శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాలలో చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి వైసిపి ఎమ్మెల్యేలు,మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం ప్రస్తుతం రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అసలు వైసీపీ నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి ఏం వ్యాఖ్యలు చేశారు అన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

 అసెంబ్లీలో జరిగిన దానిపై క్లారిటీ ఇస్తున్న వైసీపీ

అసెంబ్లీలో జరిగిన దానిపై క్లారిటీ ఇస్తున్న వైసీపీ

ఇదే సమయంలో రాజకీయాలను రాజకీయాల వరకు పరిమితం చేయకుండా, వ్యక్తిగత విమర్శలు చేసేదాకా వెళ్లడంపై పలువురు వైసిపి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని తేల్చి చెబుతున్నారు. ఇక చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారని కొనసాగుతున్న రగడ నేపథ్యంలో వైసీపీ నేతలు అసలు అసెంబ్లీలో ఏం జరిగిందన్న దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరూ ఏమీ అనలేదని, ఆమె పేరు కూడా అసెంబ్లీలో చర్చకు రాలేదని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఉంది.

 సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు

సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు

ఇక తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చంద్రబాబు తన భార్యను ఎవరో ఏదో అన్నట్టు చిత్రీకరిస్తున్నారని, ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎప్పుడూ పదవీ కాంక్ష ఉందని, పదవి కోసం చంద్రబాబు ఎవరినైనా వాడుకుంటారు అంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిది బాధపెట్టే మనస్తత్వం తప్ప బాధపడే మనస్తత్వం కాదని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టంచేశారు. చంద్రబాబు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టిస్తారు తప్ప పెట్టుకోరంటూ ద్వజమెత్తారు.

చంద్రబాబు సతీమణి పేరే సభలో రాలేదు

చంద్రబాబు సతీమణి పేరే సభలో రాలేదు


సభలో టీడీపీ సభ్యులు బాబాయ్ గొడ్డలి అంటూ నినాదాలు చేశారని, టిడిపి కామెంట్లకు మా వాళ్ళు స్పందించారని కురసాల కన్నబాబు స్పష్టంచేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు ఎందుకు ఫీలయ్యాడో అర్థం కాలేదని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఎక్కడ చర్చకు రాలేదని, కేవలం చంద్రబాబు భువనేశ్వరి గురించి మాట్లాడినట్టు తప్పుగా ప్రచారం మొదలు పెట్టారని కురసాల కన్నబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. భువనేశ్వరిపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు చేస్తున్న అనవసరపు రాద్ధాంతం అని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ ఒక డ్రామా అంటూ వైసీపీ మంత్రులు ఫైర్

చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ ఒక డ్రామా అంటూ వైసీపీ మంత్రులు ఫైర్

ఇక ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ అంతా ఓ డ్రామా అని, చంద్రబాబు అసత్యాలను నమ్మొద్దని చెప్తున్నారు. చంద్రబాబు కుటుంబం గురించి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదని అసెంబ్లీలో బాబు సతీమణి గురించి ప్రస్తావన రాలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేయగా, అని మాటలను అన్నారం టూ బాబు అబద్ధాలు చెబుతున్నారని, చంద్రబాబు భార్య గురించి ఎవరన్నారు? ఏమన్నారు? బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు కొడాలి నాని. భార్యను ఏమైనా అంటే అక్కడే చొక్కా పట్టుకోవాలి కదా.. అలా కాకుండా రాజకీయాల కోసం భార్యను అడ్డు పెట్టుకున్న చంద్రబాబు సింపతి కోసం డ్రామాలాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. అసలు చంద్రబాబు భార్య పేరు తీసుకు రానప్పుడు, ఆమెని ఎలా అవమానించామో చెప్పాలని, ఏ విధమైన అవమానం ఆమెకు జరిగిందో చెప్పాలని పదేపదే ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+