డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు దిట్టన్న మంత్రి కన్నబాబు; జగన్ అంటే జెలసీ.. పవన్ కళ్యాణ్ కు చురకలు

గులాబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలలో తీవ్రంగా పంటనష్టం జరిగిందని, రైతన్న నష్టపోయిందని, రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం పై ఉందని అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ అధికార వైసీపీ ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా పరిస్థితులపై, రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ కారణంగా వాటిల్లిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు.

పంట నష్టం అంచనాకు అధికారులను ఆదేశించాం

పంట నష్టం అంచనాకు అధికారులను ఆదేశించాం

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి లతోపాటు కృష్ణా జిల్లాలోనూ నష్టం జరిగిందని, పంట నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులను నియమించామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పంట కాలువలను చక్కదిద్దడం కోసం చర్యలు చేపట్టామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ... కన్నబాబు ఆగ్రహం

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ... కన్నబాబు ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలపై మండిపడిన మంత్రి కన్నబాబు ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడానికి తెలుగుదేశం పార్టీ పరిమితమైందని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. దుర్భిక్ష పరిస్థితుల నుంచి అనంత జిల్లా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలు సత్య దూరంగా ఉన్నాయని, వాస్తవాలను పక్కదారి పట్టించేలా టిడిపి నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలో రైతులకు చేసిందేమిటి?

టీడీపీ హయాంలో రైతులకు చేసిందేమిటి?

గతంలో టీడీపీ హయాంలో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని , విత్తనాల కోసం కూడా రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. కానీ వైసిపి హయాంలో విత్తనాల విక్రయం నుంచి పంటను విక్రయించుకునే వరకు వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటికే నేరుగా రైతుకు విత్తనాల అందిస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు.

 జగన్ అంటే పవన్ కు జెలసీ

జగన్ అంటే పవన్ కు జెలసీ

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్న పవన్ కళ్యాణ్ కు మంత్రి కురసాల కన్నబాబు చురకలంటించారు. రెండు చోట్ల ఓడిపోయానని అవమాన భారం తట్టుకోలేక పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు. సినిమా ఫంక్షన్ కి వెళ్లి రాజకీయం మాట్లాడ్డం ఏంటని ప్రశ్నించిన కురసాల కన్నబాబు, పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించారా? టిడిపి ప్రభుత్వ హయాంలో ఏనాడైనా చంద్రబాబును నిలదీశారా అంటూ నిప్పులు చెరిగారు. సీఎం జగన్ పట్ల జలసీ పవన్ కళ్యాణ్ లో అడుగడుగున కనిపిస్తోందని కురసాల కన్నబాబు మండిపడ్డారు.

చంద్రబాబు పవన్ మధ్య బంధం .. ఎక్కడికి వెళ్ళినా జగన్ ను తిట్టటమే పవన్ పని..

చంద్రబాబు పవన్ మధ్య బంధం .. ఎక్కడికి వెళ్ళినా జగన్ ను తిట్టటమే పవన్ పని..


ఎక్కడికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ మాటలు చాలా చిల్లరగా ఉన్నాయని, పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ కులాల ప్రస్తావన తెస్తున్నారని మండిపడ్డారు కురసాల కన్నబాబు. అంతేకాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య బంధం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. అందుకు ఇటీవల ఎంపీపీ కోసం కలిసిన తీరు అద్దం పడుతుందని అన్నారు. బీజేపీతో అధికారకంగా పొత్తులో ఉన్నా టిడిపికి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ఉండాలా టిడిపితో వెళ్లిపోవాలా అనేది తెలియక పవన్ ఒత్తిడిలో ఉన్నాడని మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+