వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్లకు సిగ్గు శరం లేదు .. మామూలు భాష అర్ధం కాదు .. టీడీపీ నేతలపై కొడాలి నానీ ఘాటు వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ నేతలపై పరుష పదజాలంతో విరుచుకు పడే కొడాలి నాని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేతలకు సిగ్గు శరం లేదని, వారికి ఆ భాషలోనే చెప్తే తప్ప అర్థం కాదని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మరోమారు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఓ వృద్ధ సింహం, ఆయన కథ క్లోజ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.

పిల్లనిచ్చిన మామను చంపించిన సన్నాసి .. రాజధానిలో కుక్కలు,దున్నపోతులతో పాటే బాబు : కొడాలి నానీపిల్లనిచ్చిన మామను చంపించిన సన్నాసి .. రాజధానిలో కుక్కలు,దున్నపోతులతో పాటే బాబు : కొడాలి నానీ

 టీడీపీపై, చంద్రబాబుపై మరోమారు నానీ వ్యాఖ్యలు

టీడీపీపై, చంద్రబాబుపై మరోమారు నానీ వ్యాఖ్యలు

ఏపీ మంత్రి కొడాలి నాని టిడిపిపై,చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ని లేకుండా చేస్తానని,టీడీపీ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటారని కొడాలి నాని పేర్కొన్నారు.ఎందుకంటే ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి టిడిపిని ఫినిష్ చేశారంటూ వ్యాఖ్యానించారు కొడాలి నాని. ఇక చంద్రబాబు నాయుడు ఒక వృద్ధ సింహం అని, ఆయన కథ క్లోజ్ అయిందని కొడాలి నాని తనదైన శైలిలో మాట్లాడారు.

తనకు సున్నితంగా మాట్లాడటం రాదన్న నానీ

తనకు సున్నితంగా మాట్లాడటం రాదన్న నానీ

ఇటీవల చంద్రబాబు పై విరుచుకుపడ్డ కొడాలి నాని చంద్రబాబును సన్నాసి , దద్దమ్మ అని రకరకాలుగా పరుష పదజాలంతో దూషించారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఆ పదప్రయోగం అలా కొనసాగుతూనే ఉంది.ఇప్పుడు మరోమారు టిడిపి నేతలపై వాడుతున్న భాష గురించి మాట్లాడుతూ కొడాలి నాని తనకు సున్నితంగా మాట్లాడ్డం తెలియదని, మాట కొంచెం కరకుగా ఉండటంతో అందరూ కోపం అనుకుంటారని పేర్కొన్నారు.

టీడీపీ నేతలకు సిగ్గు శరం లేదు .. అందుకే ఆ భాష

టీడీపీ నేతలకు సిగ్గు శరం లేదు .. అందుకే ఆ భాష

కొందరికి కాస్త ఘాటుగానే చెప్తే అర్థం అవుతుందని, అలాంటి వాళ్లతోనే అదేవిధంగా మాట్లాడతాను అని చెప్పిన కొడాలి నాని టిడిపిలో ఉన్న నేతలకు సిగ్గు శరం లేదని,వారికి ఆ భాషలోనే చెప్తే అర్థం అవుతుందని మరోమారు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సహా, ఇతర నేతలందరికీ పరుష పదజాలంతో చెప్తేనే అర్థమవుతుందని అందుకే అలా చెబుతున్నానని పేర్కొన్నారు. తాను టిడిపిలో ఉన్న నాటి నుండి నేటి వరకు వారిలో ఏ మాత్రం మార్పు లేదని కొడాలి నాని తెలిపారు.

టీడీపీ నుండి వచ్చే నాయకుల్లో నాకు మంచి మిత్రులు ఉన్నారన్న నానీ

టీడీపీ నుండి వచ్చే నాయకుల్లో నాకు మంచి మిత్రులు ఉన్నారన్న నానీ

టీడీపీ నేతల పద్ధతి నచ్చకే తాను టిడిపి నుండి బయటకు వచ్చానని చెప్పిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుండి ఏ నేత వైసీపీ లోకి వచ్చిన తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ తనకు మంచి మిత్రుడు అని, వైసీపీలోకి ఆయన రావాలనుకున్నప్నుడు తాను పక్కనే ఉన్నానని చెప్పారు. ప్రకాశం జిల్లా నాయకుడు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కూడా తమ పార్టీలోకి వస్తాడని చెబుతున్నారని అన్నారు. అతను కూడా తనకు మంచి సన్నిహితుడని చెప్పారు.

వల్లభనేని వంశీ, రాధా, తాను ఒకేరకమైన స్వభావం ఉన్నవాళ్ళం అన్న నానీ

వల్లభనేని వంశీ, రాధా, తాను ఒకేరకమైన స్వభావం ఉన్నవాళ్ళం అన్న నానీ


ఆ ఒక్క షరతు విధించకుండా రాజీనామాలతో సంబంధం లేకుండా వైసీపీలోకి రాదలచుకున్న ఎమ్మెల్యేలను రమ్మనమని జగన్ చెబితే, ఈ పాటికి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోయేదని కొడాలి నాని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ, రాధా, తాను ముగ్గురు ఒకే రకమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళమని, రకరకాల పరిస్థితుల నుంచి వచ్చామని, తమది ఒకటే స్వభావం అని అన్నారు. ఒక గూటి పక్షులన్నీ ఒక చోట చేరినట్టు తాము కూడా కలుస్తామని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీ సమావేశాల్లో నేతల బూతుల పంచాయితీ .. నానీ ఏమంటారో ?

అసెంబ్లీ సమావేశాల్లో నేతల బూతుల పంచాయితీ .. నానీ ఏమంటారో ?

ఏదేమైనా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మరోమారు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రధానంగా మంత్రులు వాడుతున్న భాషపైన కూడా చర్చ జరిపి అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని టిడిపి వ్యూహాలు రచిస్తోంది.మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కొడాలి నాని ఏవిధంగా స్పందిస్తారో అనేది ఆసక్తికర అంశమే.

English summary
Kodali Nani, who said that some people understand that it is a little bit worse, and that they speak the same way. The leaders of the TDP are not ashamed,All other TDP leaders, including Chandrababu, they are criticized again. saKodali Nani said that there was no change in them from the time he was in the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X