kodali nani ysrcp tdp chandrababu tirupati bjp jagan కొడాలి నాని వైసీపీ టీడీపీ చంద్రబాబు తిరుపతి బీజేపీ జగన్ politics
తిరుపతి పోరులో రత్నప్రభ తంటాలు -ఎన్టీఆర్ వారసుడు జగన్ -పగటి వేషగాళ్ల డ్రామా: మంత్రి కొడాలి నాని
మైకు చేతపట్టిన ప్రతిసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించే మంత్రి కొడాలి నాని.. టీడీపీ ఆవిర్భావదినోత్సవంపైనా అనూహ్య కామెంట్లు చేశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసారి బీజేపీపైనా నాని విరుచుకుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల తలనీతాల స్మగ్లింగ్ వ్యవహారంపైనా మంత్రి స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సంచలనం: సీఎం జగన్, ఎమ్మెల్యే ఆర్కేపై అట్రాసిటీ కేసుకు అమరావతి దళిత జేఏసీ తీర్మానం -అసైన్డ్ వివాదం

నోటా దాటేందుకు తంటాలు
ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ తరఫున గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్, బీజేపీ నుంచి రత్నప్రభ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తిరుపతిలో వైసీపీ గెలుపు లాంఛనమేనని మంత్రి పెద్దిరెడ్డి ఇదివరకే ప్రకటించగా, ఇప్పుడు మంత్రి కొడాలి నాని సైతం తిరుపతి సీటు తమదేనని, 5 లక్షల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో నోటాను దాటేందుకు బీజేపీ నానా తంటాలు పడుతోందని మంత్రి ఎద్దేవా చేశారు.

తిరుమల తలనీలాలపై రాజకీయం
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో మయన్మార్ సరిహద్దుల వద్ద కాపలా కాస్తోన్న అస్సాం రైఫిల్స్ దళాలు ఓ వాహనాన్ని తనిఖీ చేయగా, 120 బ్యాగుల నిండా తల వెంట్రుకలు పట్టుపడ్డాయి. అక్రమంగా చైనాకు తరలిస్తోన్న ఆ వెంట్రుకల విలువ రూ.2కోట్ల వరకు ఉంటుందని తేలింది. కాగా, అవి తిరుమలలో భక్తులు శ్రీవారికి సమర్పించిన తలనీలాలే అని, వాటి అక్రమ తరలింపు వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే, అసలా వెంట్రుకలకు టీటీడీతో సంబంధమే లేదని అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నిక వేళ తిరుమల శ్రీవారి తలనీలాల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి నాని మండిపడ్డారు.

వెంకన్న ఆశీర్వాదంతో 5లక్షలు..
తిరుపతి ఎన్నిక వేళ తిరుమల ఆలయంపై తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికే బరిలో నిలిచిన జాతీయ పార్టీ బీజేపీ నోటాను క్రాస్ చేయడానికి నానా తంటాలు పడుతోందని మంత్రి నాని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ అయితే డిపాజిట్ వస్తే చాలని దేవుడికి మొక్కుకుంటోందన్నారు. దేవుడ్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నవారికి ఉపఎన్నికలో వెంకటేశ్వరస్వామి బుద్ధి చెబుతాడని, వైసీపీ మాత్రం మెజార్టీలో కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైందని, వైసీపీ అభ్యర్థి 5 లక్షల మెజారిటీతో గెలిచేలా దేవుడు ఆశీర్వదిస్తాడని మంత్రి నాని అన్నారు. ఏపీ సర్కారు విపరీతంగా అప్పులు చేస్తోందన్న విమర్శపై..

అమరావతి బ్యాంకు నుంచి అప్పులు..
జగన్ హయాంలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని విమర్శలు చేస్తున్నవారికి.. చంద్రబాబు చేసిన అప్పులు కనిపించలేదా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఏకంగా 3.60లక్షల కోట్ల అప్పులు తెచ్చి, దుబారాగా ఖర్చు పెట్టడం తప్ప.. లేని అమరావతి బ్యాంక్ ద్వారా పక్కా రాష్ట్రాలకు, సింగపూర్ లాంటి దేశాలకు అప్పులు ఇచ్చినంత బిల్డప్ బాబు ఇస్తున్నారని మండిపడ్డారు. కరోనా విలయ కాలంలో సీఎం జగన్ అప్పులు చేసి మరీ ప్రజాసంక్షేమం కోసం ఖర్చు పెట్టారని, లాక్ డౌన్ సమయంలో రూ.90వేల కోట్ల అప్పులు తెచ్చి నిరుపేదల ఎకౌంట్లో డబ్బులు వేసి వారిని రక్షించారని, సీఎం చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించారని నాని గుర్తుచేశారు. ఇక..

అది పగటి వేషగాళ్ల డ్రామా..
‘‘ఎన్టీఆర్ సిద్ధాంతాలను, ఆశయాలను చంద్రబాబు ఏనాడో తుంగలో తొక్కాడు. నిన్న జరిగింది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా. ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ అంటే.. చంద్రబాబు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక ప్రజల్ని పచ్చి బూతులు తిడుతున్నాడు. చంద్రబాబు చరిత్ర అంతా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకోవడమే తప్ప ప్రజల మద్దతుతో సీఎం అయిన వ్యక్తి కాదు. ఎన్టీఆర్ కు రాజకీయాలు తెలియవు కాబట్టే.., ఆయన పార్టీని, పదవిని లాక్కొని చంద్రబాబు సీఎం అయ్యాడు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడిననా రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్తూనే ఉంటారు'' అని మంత్రి కొడాలి నాని అన్నారు.
ఆకు రౌడీలు.. లాఠీలతో భయపెట్టలేరు -ఏసుక్రీస్తుకు యూదా, కేరళకు విజయన్ ద్రోహం -ప్రధాని మోదీ సంచలనం