బట్టలూడదీసి 11 సీట్లకే పరిమితం చేస్తే చాలలేదా జగన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈరోజు జగన్ మిర్చి యార్డ్ కి వెళ్లి రైతులని కలిసారని ఎన్నికల కోడ్ అమలులో ఉందని అనుమతి లేదని అధికారులు చెప్పినప్పటికీ లెక్కచేయకుండా ప్రవర్తించారని ఆయన విమర్శించారు.

జగన్ పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి
మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటన పేరుతో కొత్త డ్రామాకు తెర లేపారని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ హయాంలో రైతుల కోసం చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో 14,000మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, రైతుల ఆత్మహత్యలలో దేశంలో ఏపీ మూడవ స్థానంలో జగన్ హయాంలో నిలిచిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Minister kollu ravindra counter to ys jagan over his mirchi yard visit

జగన్ రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చెయ్యాలని చూస్తున్నారు
జగన్ దుర్మార్గమైన కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం లో నిలిపివేసిన పోలవరం పనులు సీఎం చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక దళితుడైన సత్య వర్ధన్ పై దాడి చేసిన ఘటనలో నిందితుడైన వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడమే కాకుండా పోలీసులను, అధికారులను భయపెట్టే విధంగా మాట్లాడారని మండిపడ్డారు.

బట్టలూడదీసి 11 సీట్లు ఇస్తే చాలలేదా
ఐదేళ్లు చేసిన దుర్మార్గ కార్యక్రమాల కారణంగానే ప్రజలు బట్టలు ఊడదీసి 11 సీట్లు ఇచ్చారని, ఇక ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలలో ఆ 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
ఇక వైసిపి నాయకులకు రెడ్ బుక్ పేరు వింటే తడిసిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వంశీ తగలబెట్టారని అన్నారు.

ఐదేళ్ళ దోపిడీ కోసం జగన్ మద్యం పాలసీ
సత్య వర్ధన్ ను వంశీ, ఆయన అనుచరులు బెదిరించి తీసుకు వెళుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయని పేర్కొన్నారు .ఇక తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఫైల్స్ అన్ని తగలబెట్టారని ఆరోపించారు. జగన్ అక్రమ మద్యం విధానం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారని పేర్కొన్నారు ఐదేళ్ల దోపిడీ కోసం జగన్ పాలసీ తీసుకు వస్తే, ప్రజల ఆరోగ్యం కోసమే మళ్లీ దానిని మార్చి కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+