ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలో ఆ పోస్టుల భర్తీ!

ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ఒక శుభవార్త చెప్పారు. ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు త్వరలో యూనివర్సిటీలలో ఉద్యోగాల భర్తీ ఉండబోతుందని ఆయన ప్రకటించారు. ఉండవల్లి లోని తన నివాసంలో విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులతో సమావేశమైన నారా లోకేష్ ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు.

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై లోకేష్ చెప్పిందిదే
రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కోసం కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ కళాశాలలు, విద్యార్థులపై ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. గత ప్రభుత్వం దాదాపు 4200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పెండింగ్లో పెట్టిందని, ఆర్థిక వెసులుబాటు చూసుకొని దశలవారీగా పెండింగ్ నిధులను చెల్లిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.

minister lokesh said about fee reimbursement and said good news on job notifications

Take a Poll

కళాశాలల అడ్మిషన్ లపై లోకేష్ నిర్ణయం
ఇదే సమయంలో కళాశాలలలో, యూనివర్సిటీలలో రాజకీయ ప్రసంగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని నారా లోకేష్ స్పష్టం చేశారు. కళాశాలల నుండి నిర్వహించే యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ లకు విద్యార్థిసంఘాలు సహకరించాలని ఆయన కోరారు. ఈసారి కళాశాలలో అడ్మిషన్లు ఆలస్యం కాకుండా తగినచర్యలు చేపడతామని, వచ్చే ఏడాది కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల షెడ్యూల్ ను ఈ ఏడాదే ప్రకటిస్తామని షెడ్యూల్ ప్రకారమే టెస్టులను నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు.

ఆ అధ్యాపక పోస్టుల భర్తీకి త్వరలోనే చర్యలు
ఇక యూనివర్సిటీలలో మిగిలిపోయిన సీట్లకు నేరుగా అడ్మిషన్లు కల్పించాలని విద్యార్థి సంఘం నేతలు కోరగా, బేసిక్ ఎగ్జామినేషన్ పాస్ కావాల్సిందేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 4300 అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పోస్టుల భర్తీ విషయంలో ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించి భర్తీ చేస్తామన్నారు.

హాస్టల్స్ సిబ్బందిని భర్తీ చేస్తామన్న లోకేష్
హాస్టల్స్ లో సిబ్బందిని కూడా భర్తీ చేస్తామని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటి, వాచ్మెన్ పోస్టులను భక్తి చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు. యూనివర్సిటీలు కళాశాలలలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ను విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు కోరగా అందుకు లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+