స్కూటర్ నడిపిన మంత్రి పీతల సుజాత: కిందపడిన పోలీస్
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత జన చైతన్య యాత్ర పోలీసులకు తంటా తెచ్చి పెట్టింది. జన చైతన్య యాత్రలో భాగంగా ఆమె బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆమె మోటార్ సైకిల్‌ను నడిపారు.
మంత్రి యాత్ర పోలీసులకు, గన్‌మెన్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డు జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు, పాత బస్టాండ్, గంగానమ్మ గుడి సెంటర్, కొత్త బస్టాండ్, బోసుబొమ్మ సెంటర్, జెపి సెంటర్ వరకు ఐదు కిలోమీటర్ల మేర మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో సుజాత స్కూటర్ నడిపారు. మంత్రి వెంట ఇద్దరు గన్‌మెన్, జంగారెడ్డిగూడెం ఎస్సై ఆనందరెడ్డి, ఇతర పోలీసులు సుమారు ఐదు కిలోమీటర్లు పరుగెత్తడానికి ఇబ్బందులు పడ్డారు. స్థానికి ఏలూరు రోడ్డులోకి వచ్చేసరికి మంత్రి గన్‌మన్ గంగాధర్ పరుగెత్తుతూ తూలి పడిపోయారు.
వెనక వస్తున్న మోటార్ సైకిళ్లను కంట్రోల్ చేయడంతో అతనికి ప్రమాదం తప్పింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications