మంత్రి మృణాళిని భర్తకు గుండెపోటు: విశాఖకు తరలింపు, చంద్రబాబు ఫోన్
విజయనగరం/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని భర్త కిమిడి గణపతిరావుకు గుండెపోటుతో బాధపడుతూ విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెలియడంతో జిల్లాలో అధికారిక కార్యక్రమాలను రద్దుచేసుకుని హుటాహుటిన మంత్రి మృణాళిని విశాఖ బయల్దేరింది.
కాగా, మంత్రి మృణాళినికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి క్షేమసమాచారం తెలుసుకున్నట్లు తెలిసింది. అపోలో వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

కాగా, గణపతిరావు 1999లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఈయన సోదరుడు అవుతారు. గణపతిరావు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications