ఆగస్ట్ 25నుండి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ సరఫరాపైన మంత్రి నాదెండ్ల సంచలనం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 25వ తేదీ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయని తెలిపారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
నాలుగు కోట్ల మందికి రేషన్, గ్యాస్ రాయితీ విషయంలో కూడా
రేషన్ షాప్ ల ద్వారానే gcc ఉత్పత్తులను అందించే నిర్ణయం తీసుకున్నామని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నాలుగు కోట్ల మందికి రేషన్ అందిస్తున్నట్లు గా ఆయన తెలిపారు. గ్యాస్ రాయితీ విషయంలో డిజిటల్ వారెంట్ కూపన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పిన ఆయన ఇకనుండి నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తామని వెల్లడించారు.

వృద్ధులు, వికలాంగులకు నేరుగా ఇంటి వద్దకే రేషన్ సరుకులు
ఇక 65 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న వృద్ధులకు నేరుగా ఇంటి వద్దకే రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని, వృద్ధులకు, వికలాంగులకు ప్రతినెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇస్తామని తెలిపారు. ఎండియు వాహనాల తొలగింపు విషయంలో తమ ప్రభుత్వానికి సుమారు 200 కోట్లు నష్టం జరిగినా, ముందుకు వెళ్ళినట్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
రేషన్ పంపిణీలో తప్పులు చేస్తే కఠిన శిక్షలు
దీపం పథకం కింద ఫస్ట్ ఫేజ్ లో కోటి మందికి, సెకండ్ ఫేజ్ లో 95 లక్షల మందికి సబ్సిడీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్టుగా పేర్కొన్న ఆయన దీనిపైన ఇప్పటికే అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎవరు ఎటువంటి తప్పులు చేసిన కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ తరలింపు పై నిఘా పెట్టామని, చట్టంలో మార్పులు కూడా తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications