సమస్యలు చెప్పుకోవాలంటే ఆయనను కలవాల్సిందే..

Nara Lokesh Praja Darbar: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులకు ఫోర్ట్‌ఫోలియోలను సైతం కేటాయించారు. చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. పాలనను పరుగులెత్తించడంపై దృష్టి సారించారు.

ఈ క్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్- ఓ అడుగు ముందుకేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల్లోనే ఆయన కార్యాచరణలోకి దిగారు. ప్రజా దర్బార్‌కు శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యలను నేరుగా వారి నుంచే స్వీకరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారాయన. వాటిని పరిష్కరించడానికీ అదేస్థాయిలో ప్రాధాన్యతను ఇస్తోన్నారు.

Minister Nara Lokesh conducts Praja Darbar in Mangalagiri

ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నారా లోకేష్. స్థానిక ప్రజలను కలుసుకుంటారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు.

ఈ ఉదయం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానికులు ఉండవల్లి నివాసంలో నారా లోకేష్‌ను కలుసుకున్నారు. తాము ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించాలంటూ లిఖితపూరకంగా విజ్ఞప్తి చేశారు.

వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని అధికారులను సూచించారు. మొన్నటి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు నారా లోకేష్.. ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేశారు.

Minister Nara Lokesh conducts Praja Darbar in Mangalagiri

స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినపుడు మినహా ఉండవల్లిలో ఉన్నపుడు ప్రతిరోజూ ఉదయం లోకేష్ స్థానిక ప్రజలను అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ అప్పట్లో విస్తృతంగా ప్రచారం చేశారాయన.

ఇచ్చిన మాట ప్రకారం.. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ ను నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2019 నుంచి తన సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచారు నారా లోకేష్. నారా లోకేష్ వేసిన ఈ తొలి అడుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం అవుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+