రంగంలోకి దిగిన నారా లోకేష్, డ్రోన్ లు ఎంట్రీ, బుడమేరు కథ కొలిక్కి వస్తోంది
బుడమేరు గండ్ల లీకేజ్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విజయవాడలో సంబంధిత అధికారులు, జనవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడతో సమావేశం అయిన మంత్రి నారా లోకేష్ విజయవాడ వరద బాధితులను వీలైనంత త్వరగా ఆదుకోవడానికి ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
బుడమేరు దగ్గర యుద్ద ప్రతిపాదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట సీపేజ్ లీకేజ్ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు వరద నీరు తగ్గిందని అన్నారు. బుడమేరు నుంచి వస్తున్న వరద నీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. బుడమేరు గండ్లను పూడ్చి వేసిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం అయ్యాయి. బుడమేరు గండ్లు పూడ్చిన చోట సుమారు ఆరు మీటర్ల ఎత్తు పెంచుతున్నారు.

బుడమేరు గండ్లు పూడ్చిన చోట ఎత్తు పెంచుతున్న పనులను డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిలస్తున్న మంత్రి నారా లోకేష్ ఆపనులు వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో బుడమేరు గండ్లు పూడ్చిన చోట ఎత్తు పెంచుతున్న వివిద శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్న మంత్రి నారా లోకేష్ వాటి పనులు వేగవంతం చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరో వైపు వరద నష్టంపై అంచనా పర్యవేక్షణ కోసం36 మంది ప్రజాప్రతినిధిలను నియమించారు. నష్టపరిహారం అంచనా, వరదద బాధితులకు అందుతున్న సహాయం గురించి వివిద శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్న మంత్రి నారా లోకేష్ బాదితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో సంబందిత అదికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చర్చలు జరుపుతూ బడమేరు లీకేజ్ ను సోమవారం సాయంత్రం లోపు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications