ప్రధాని మోదీతో నారా లోకేష్ చర్చల సారాంశం ఇదే..

Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అమరావతి నిర్మాణంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకుంటోంది.

మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అమరావతికి వచ్చిన విషయం తెలిసిందే. రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కొన్నింటిని ప్రారంభించారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ నిర్మాణానికి దీన్ని శుభసంకేతంగా అభివర్ణించారాయన అప్పట్లో.

Minister Nara Lokesh met PM Modi in Delhi along with his family members

ఇప్పుడు మరోసారి ఏపీ గడప తొక్కబోతోన్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21వ తేదీన విశాఖపట్నానికి రానున్నారు. యోగా దినోత్సవాన్ని ప్రకటించి 10 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌... వన్‌ హెల్త్‌ అనే కాన్సెప్ట్ కింద దీన్ని నిర్వహించనుంది. యోగా దినోత్సవాన్ని చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రత్యేకంగా నిర్వాహక కమిటీనీ ఏర్పాటు చేసింది

హోమ్, ఆరోగ్యం, టూరిజం, సాంఘిక సంక్షేమం, మానవ వనరుల శాఖ మంత్రులతో ఈ కమిటీ ఏర్పాటైంది. అలాగే- ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు ఈ కమిటీకి సమన్వయకుడిగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ రాక, ఇతర ఏర్పాట్లన్నింటినీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

ఈ పరిణామాల మధ్య ఐటీ, మానవ వనరుల అభివ్రద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌.. ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ తో కలిసి నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్ నివాసానికి వెళ్లారు. మర్యాదపూరకంగా కలుసుకున్నారు. యువగళం పేరుతో గతంలో నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.

లోకేష్ పాదయాత్రను ప్రశంసించారు. బ్రాహ్మణి, దేవాన్ష్‌కు ఆశీస్సులు అందించారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను ప్రారంభించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు నారా లోకేష్. రాష్ట్రావృద్ధికి నిరంతరం సహకరిస్తోన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

2047 నాటికి వికసిత్ భారత్ కోసం మోదీ మార్గదర్శకత్వంలో తామందరం పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. మోదీ దార్శనికత.. ఏపీ పురోగమనానికి ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివ్రద్ధి సాధిస్తోందని, అందులో ఏపీ భాగస్వామ్యం అయిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+