తనకు ఆ భద్రత చాలంటూ.. మంత్రి లోకేష్ సంచలనం... ఆయన నిర్ణయాలు నెక్స్ట్ లెవల్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటి మరియు విద్యాశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తన శాఖల అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. నేడు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరిలో లోకేష్ బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులతో కలిసి బక్రీద్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు.
బక్రీద్ ప్రార్ధనలలో పాల్గొన్న సమయంలో లోకేష్ సంచలన నిర్ణయం
బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారన్న లోకేష్ బక్రీద్ మతసామరస్యానికి ప్రతీక అన్నారు. మంగళగిరి అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో లోకేష్ బక్రీద్ ప్రార్ధనలో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అయితే మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో ఆయనకు భద్రత విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉన్న విషయాన్ని లోకేష్ గమనించారు. దీంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉన్నతాధికారులు ఆ పనులు చెయ్యాలన్న లోకేష్
తనకు భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉండడంతో ఉన్నతాధికారులు తన భద్రతా విధుల్లో పాల్గొనవద్దని మంత్రి లోకేష్ వారికి సూచించారు. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని, తనకోసం అదనంగా ఉన్నతాధికారులు తమ సమయాన్ని వృధా చేయవద్దని లోకేష్ సూచించారు. తనకోసం ఉన్నతాధికారులు భద్రతా విధుల్లో పాల్గొనే బదులు మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయిని 100రోజుల్లో పూర్తిగా అరికట్టే బాధ్యత తీసుకోవాలని లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు.
తన కోసం సమయం వృధా చెయ్యొద్దు అని సూచన
మహిళలకు రక్షణ కల్పించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, ఇతర ముఖ్యమైన అంశాలపై మాత్రమే ఉన్నతాధికారులు పనిచేయాలని నారా లోకేష్ వారికి సూచించారు. తనకోసం అంతమంది సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదన్నారు లోకేష్. మొత్తంగా ఈసారి పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్ తమదైన పంధాలో ముందుకు సాగుతున్నారు.
మంగళగిరిలో ప్రజా దర్బార్ పై లోకేష్ స్పందన
ఇక మరోవైపు మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తుందని లోకేష్ పేర్కొన్నారు నియోజకవర్గ నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారని పేర్కొన్న లోకేష్ మంగళగిరి ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యను వింటూ వారికి నేనున్నానని భరోసా ఇస్తున్నానని తెలిపారు.
ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్న లోకేష్
అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వారందరి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. విద్యా వైద్య ఖర్చులకు సహాయం అందించాలని పలువురు కోరారని, కొందరు వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలవంతంగా తమ భూములను లాక్కున్నారని ఫిర్యాదులు చేశారన్నారు. అందరి సమస్యలను విన్నానని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని లోకేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications