ఏంటిది: మంత్రి నారాయణకి కోపమొచ్చింది(పిక్చర్స్)
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులను మంత్రి నారాయణ ఆదివారం సందర్శించారు. పనులు సక్రమంగా జరగకపోవడం, నాణ్యత లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రితో పాటు స్థానిక శాసన సభ్యులు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ రజనీ శేషసాయి తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ఇదే సందర్భంగా వియ్ ఆర్ ఫర్ రాజమండ్రి, రైసింగ్ రాజమండ్రి సభ్యులు నిర్వహిస్తున్న స్వచ్చ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని, గోడలకు పెయింటింగ్ వేశారు.

నారాయణ
గోదావరి పుష్కరాల పనులు జరుగుతున్న తీరును రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పీ నారాయణ ఆదివారం తనిఖీ చేశారు. పుష్కరాల ముహూర్తం దగ్గరపడుతుండటంతో పనుల్లో వేగం పెంచాలన్న లక్ష్యంతో మంత్రి నారాయణ పరిశీలన జరిపారు. ఉదయం ఆరు గంటలకు ఆర్‌అండ్‌బి అతిథిగృహం నుండి బయలుదేరి కోరుకొండ రోడ్డులోని డ్రెయిన్ నిర్మాణ పనులను తనిఖీ చేయటం ద్వారా పర్యటనను ప్రారంభించారు.

నారాయణ
డ్రెయిన్ నిర్మాణ పనులు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, జరుగుతున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కోరుకొండ రోడ్డు నుండి పేపరు మిల్లుకు వెళ్లే రోడ్డులో పైపులైన్ వేసేందుకు రోడ్డును తవ్వి, తర్వాత కాంక్రీట్ వేసిన విధానం పట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల రోడ్డు అస్తవ్యస్తంగా తయారవుతుందని, దీనిని సరిచేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

నారాయణ
పనులు జరుగుతున్న తీరుపట్ల అసంతృప్తి వ్యక్తంచేసిన మంత్రి నారాయణ, అక్కడి నుండే పబ్లిక్ హెల్త్ ఇఎన్‌సి, ముఖ్యకార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. రాజమండ్రి నగరంలోని పనులన్నింటినీ తనిఖీచేసి తనకు నివేదికను సమర్పించాలన్నారు. అనంతరం లూథర్‌గిరి వద్ద నిర్మించిన సిమెంటు రోడ్డును పరిశీలించారు. కోటిలింగాల పేటలో మరమ్మతులు చేపట్టిన మరుగుదొడ్లు, సిమెంటు రోడ్లను పరిశీలించారు. ఇఎస్‌ఐ ఆసుపత్రి వద్ద డ్రెయిన్లను పరిశీలించి, అసంతృప్తి వ్యక్తంచేశారు.

నారాయణ
డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేదని, డ్రెయిన్లలో సిల్టు పేరుకుపోయిందన్నారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులను పిలిచి, వారి చేతిలో ఉన్న కర్రను తీసుకుని డ్రెయిన్లలో సిల్ట్ ఎంత ఉందో పరిశీలించారు. డ్రెయిన్లలో సిల్ట్ ఎందుకు తీయలేదని మున్సిపల్ అధికారులను నిలదీశారు. అక్కడి నుండి కోటిలింగాలఘాట్, పుష్కర్‌ఘాట్లకు వెళ్లి విస్తరణ పనులను పరిశీలించారు. 1.2కిలోమీటర్ల వెడల్పున నిర్మిస్తున్న కోటిలింగాల ఘాట్ విస్తరణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరిలో బోటులో ప్రయాణించి, ఘాట్లను నదివైపు నుండి పరిశీలించారు.












Click it and Unblock the Notifications