హైక్లాస్ రాజధానికి: నారాయణ, జగన్-కేసీఆర్‌లపై కిషోర్

Minister Narayana to go to Singapore
హైదరాబాద్: వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణానికి రూ.లక్షన్నర కోట్లకు పైగా అవసరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మంగళవారం అన్నారు. మంత్రి నారాయణ నెలాఖరున సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ నారాయణ బృందం రాజధాని అంశంపై అధ్యయనం చేస్తోంది. దీనిపై నారాయణ మంగళవారం మాట్లాడారు.

అత్యాధునిక రాజధానికి లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అవుతుందని చెప్పారు. సాధారణ రాజధానికే 90వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన అన్నారు. వందేళ్ల జనాభాను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని ఎంపిక, డిజైన్ విషయంలో ఆరు నెలలలో స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

రాజధాని కోసం 30 టీఎంసీల నీటిన ఇవ్వాలని తాము సీడబ్ల్యూసీని కోరినట్లు చెప్పారు. వీజీటీఎం పరిధిలో 184 కిలోమీటర్ల ఓటర్ రింగ్ రోడ్డుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు. విజయవాడ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామన్నారు. ఈ రింగ్ రోడ్డు లోపలే రాజధాని ఉంటుందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. సింగపూర్‌తో పాటు మరో మూడు దేశాల్లో పర్యటించి తమ బృందం అధ్యయనం చేస్తుందన్నారు.

కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధికి అందరు సహకరించాలని ఆయన కోరారు.

జగన్, కేసీఆర్‌లపై రావెళ్ల ఆగ్రహం

ఏపీ మంత్రి రావెళ్ల కిషోర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. హైదరాబాదు అభివృద్ధి చంద్రబాబు వల్లే అయిందన్నారు.

హైదరాబాదు అభివృద్ధి చెందడం వల్ల తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. విలువ లేని భూములకు విలువ వచ్చిందన్నారు. కాంగ్రెసు పార్టీ అడ్డగోలుగా విభజన చేస్తే దానికి కేసీఆర్ సహకరించారన్నారు. కేసీఆర్, జగన్‌లు ఒకరినొకరు ఎప్పుడు విమర్శించుకోలేదన్నారు. సమైక్యవాదిని అంటూ జగన్ ప్రజలను మోసం చేయడమే కాకుండా తనను తాను మోసం చేసుకున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+