అమరావతిలో మంత్రి నారాయణ Vs కమిషనర్ - ఇదీ పంచాయితీ....!!
రాజధాని అమరావతిలో కొత్త పంచాయితీ తెర మీదకు వచ్చింది. మంత్రి నారాయణ..సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ మధ్య వార్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్య సమన్వయం లోపించింది. కమిషనర్ తీరు పైన మంత్రి నారాయణ అసంతృప్తిగా ఉంటే.. అమాత్యుడి తీరుతో సీఆర్‌డీఏలో కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించలమపూ భావనలో కమిషనర్ ఉన్నారు. ఈ ఇద్దరి వ్యవహారం సీఎంఓకు చేరింది.
అమరావతి కేంద్రంగా
అమరావతిలో మంత్రి నారాయణ రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీఆర్డీఏ కమిషనర్ గా సీఎం చంద్రబాబు ఏరి కోరి కామటనేని భాస్కర్ ను నియమించారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య సమన్వయం లోపించింది. మంత్రి సీఆర్‌డీఏ కమిషనర్ కార్యాలయానికి వెళ్లినప్పుడల్లా.. ఆయన తన చాంబర్‌ను మంత్రికి వదిలేసి వేరే పేషీలో కూర్చుంటున్నారు. ఈ ఇద్దరికీ పొసగడం లేదన్న ప్రచారం అమరావతిలో కొనసాగుతోంది పలు అంశాలపై వారు పరస్పరం చర్చించుకుని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నాలే జరగడం లేదు.

మంత్రి తీరుతో
ఈ ఇద్దరి కారణంగా సకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు వాయిదాపడుతున్నాయి. సీఆర్‌డీఏలో జరిగే నిర్ణయాల్లో కొన్ని గోప్యత పాటించాల్సినవి ఉంటాయని కమిషనర్ చెబుతున్నారు. అయితే, ఈ విషయాలను మంత్రి బయటకు వెల్లడించటం పైన కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టెండర్ల ప్రక్రియ విషయంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఎదురుపడినా మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడిందని సమాచారం.
కమిషనర్ ను తప్పించాలంటూ
దీంతో మంత్రి నారాయణ ఇక కమిషనర్‌ను తప్పించకుంటే పనులు సజావుగా సాగవని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. భాస్కర్ బదిలీకి సంబంధించి మంత్రి కార్యాలయం నుంచి ఫైలు కూడా సీఎం వద్దకు వెళ్లిందని,ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. భాస్కర్ బదిలీ తప్పదనే ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరి సారథ్యంలో పనులు చకచకా సాగుతాయని చంద్రబాబు భావించారు. అయితే వారిద్దరి మధ్య విభేదాలతో ప్రతిష్ఠాత్మకమైన రాజధాని పనులపైన ప్రభావం పడుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications