వైసీపీ నాయకులకు బిగిస్తున్న ఉచ్చు, నీచ రాజకీయాలు, వదిలేదిలేదు, నిమ్మల
ప్రకాశం బ్యారేజ్ ని ఐదు బోట్లు డీకొట్టిన ఘటన కేసు రసవత్తరంగా మారుతోంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు డీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని ఇప్పటికే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి వైసీపీ మద్దతుదారులు కావాలనే పెద్దపెద్ద బోట్లు ప్రశాశం బ్యారేజ్ గేట్లను డీకొట్టేలా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు పోలీసులు కూడా ఇదే మాట చెబుతున్నారని అన్నారు. రాజకీయాలు చెయ్యడానికి ఇది సమయం కాదని కొంచెం కూడా ఆలోచించకుండా వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో వైసీపీకి చెందిన ఉషాద్రి, రామ్మోహన్ తదితరులు ప్రకాశం బ్యారేజ్ గేట్లను దెబ్బ తియ్యడానికి ఐదు పెద్దపెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజ్ లోకి వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయాడు ఆరోపించారు.

సుమారు 40, 50 టన్నుల ఉన్న ఐదు బోట్లను వైసీపీ మద్దతుదారులు ప్రకాశం బ్యారేజ్ లోకి వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ లోకి వెళ్లిన ఆ బోట్లలో మూడు బోట్లు యజమాని వైసీపీ నాయకుడు ఉషాద్రి అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని, బోట్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు ఆ బోట్లు ఉషాద్రివి అని తేల్చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పెద్దపెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజ్ లోని 67, 68, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా డీకొట్టాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను డీకొట్టిన బోట్ల యజమానులు రామ్మోహన్, ఉషాద్రి బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ కు చాలా సన్నిహితులు అని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించిన నిందితులు ఎవరైనా సరై వదిలిపెట్టకూడదని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని, విజయవాడ పోలీసులు కేసును క్షణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో వైసీపీ నాయకులు బురద రాజకీయాలు చెయ్యడమే కాకుండా చివరికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సిగ్గుచేటు అని మంత్రి నిమ్మల రామానాయుడు విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications