హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అవినీతిపై మాట్లాడటం అతి పెద్ద జోక్: మంత్రి పల్లె, కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ: బొండా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అవినీతి పేటెంట్ హక్కు కలిగిన వైయస్ జగన్ అవినీతిపై మాట్లాడటం, ఈ దశాబ్దంలోనే అతి పెద్ద జోక్ అని మంత్రి పల్లె రఘనాథ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శాసనసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

ప్రపంచంలోనే అవినీతి చిట్టా తీస్తే వైయస్ జగన్ పేరు ముందు ఉంటుందన్నారు. గిన్నిస్ బుక్‌లో కూడా రికార్డు సాధిస్తారన్నారు. అలాంటి వైయస్ జగన్ ఈరోజు అవినీతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి, ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాలు అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

ప్రపంచ దేశాలు సైతం రాజనీతిజ్ఞుడని మెచ్చుకుంటున్న చంద్రబాబు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఆకాశంలో ఉండే చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ, మా నాయుకుడు చంద్రబాబు నాయుడుకి మచ్చ లేదన్నారు. చంద్రాబాబుతో పోల్చుకునేంత స్టేచర్, హుందాతనం వైయస్ జగన్‌కు లేదన్నారు.

చంద్రాబాబుకు, జగన్‌కు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. చంద్రబాబు నాయుడుపై స్వయంగా వైయస్ విజయమ్మ కేసులు పెట్టినా సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా బుద్దిరాలేదన్నారు. అత్యంత అవినీతి పరుడు ఎవరంటూ రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా జగన్ పేరు చెబుతారన్నారు.

Minister Palle Raghunatha Reddy fires on YS Jagan

ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీల టికెట్లను బేరం పెట్టారని ధ్వజమెత్తారు. అలాంటి జగన్‌కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు. శాసనసభలో పోడియం ముందు ప్రతిపక్ష సభ్యులు, ప్రతిపక్ష నేతగా నిరసనలు తెలిపిన దాంట్లో కూడా రికార్డు సృష్టించారన్నారు.

శాసనసభలో అవగాహాన లేకుండా అనవసర ప్రసంగం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో రౌడీలు, గుండాలుగా మాదిరి ప్రతిపక్ష సభ్యులు ప్రవరిస్తున్నారని అన్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపైనా, చట్టాలపైనా నమ్మకం లేదన్నారు. చరిత్రలో వైయస్ జగన్ ఓ ద్రోహిలాగా నిలిచిపోతాడన్నారు.

కేసీఆర్ చేతిలో కీసుబొమ్మ: బొండా ఉమామహేశ్వరరావు

అవినీతి గురించి వైయస్ జగన్‌కు మాట్లడే హక్కు లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన శాసనసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గత నాలుగు రోజులుగా శాసనసభ సమావేశాలను ప్రతి నిమిషం కూడా అడ్డుకుంటూ క్వశ్చన్ అవర్స్ జరగనీయకుండా విలువైన సభా సమావేశాన్ని వృధా చేసిన ఘనత జగన్‌దేనన్నారు.

పక్క రాష్ట్రంలో జరిగిన ఓ కేసు గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారన్నారు. మిత్రుడు కేసీఆర్‌తో కలిసి ఈ రాష్ట్రాంలో ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారన్నారు. అవినీతి పేటెంట్ హక్కు జగన్‌దేనని ధ్వజమెత్తారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు వైయస్ జగన్‌కు లేదన్నారు.

దొంగే దొంగ అని మాట్లాడినట్లు ఉందని ప్రజలు అంటున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుతున్నావు... సెక్షన్ 8 గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సెక్షన్ 8పై కేసీఆర్‌ని ఒక్కసారైన పల్లెత్తు మాట అన్నావా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ లాగా వ్వవహారిస్తూ,
రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నావని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని కుట్రలు, కుతంత్రాలు ఏమీ చేయలేవని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

ఈరోజు శుక్రవారం. కోర్టులో అనుమతితో అసెంబ్లీకి వచ్చావు. 11 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న నీవు అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు వైయస్ జగన్‌ను విశ్వసించరన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

పోడియం వద్దకు సభ్యులను పంపించి, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్నావని దుయ్యబట్టారు. తీర్చు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రోజురోజుకీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు దిగజారి పోతుందన్నారు. ప్రజా సమస్యలపై చిత్తుశుద్ధితో వ్యవహరించాలని కోరుతున్నామన్నారు.

English summary
Minister Palle Raghunatha Reddy fires on YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X