వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక .. వైసీపీ అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో మరో ఉప ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల కమీషన్ ముహూర్తం పెట్టింది . ఏప్రిల్ 17 తేదీన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా వైసిపి రికార్డు సృష్టిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

దమ్ముంటే చంద్రబాబు .. పుంగనూరులో ఆ పని చెయ్ .. మంత్రి పెద్దిరెడ్డి సవాల్దమ్ముంటే చంద్రబాబు .. పుంగనూరులో ఆ పని చెయ్ .. మంత్రి పెద్దిరెడ్డి సవాల్

తిరుపతి ఉప ఎన్నికల్లో మూడు లక్షల వరకు మెజారిటీ సాధిస్తాం

తిరుపతి ఉప ఎన్నికల్లో మూడు లక్షల వరకు మెజారిటీ సాధిస్తాం

తిరుపతి ఉప ఎన్నికల్లో మూడు లక్షల వరకు మెజారిటీ సాధిస్తామని నమ్మకం ఉందన్నారు. తిరుపతి లోక్సభ పరిధిలోని అన్ని మునిసిపాలిటీలలో భారీ విజయాన్ని నమోదు చేశామని పేర్కొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . సీఎం జగన్ పరిపాలన కు ప్రజలు పట్టం కడుతున్నారని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు అన్నీ క్లియర్ అయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు .

తిరుపతి ఉపఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థి ఆయనే

తిరుపతి ఉపఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థి ఆయనే

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి కార్పొరేషన్ లో ఇద్దరు డిప్యూటీ మేయర్ లను, మున్సిపాలిటీ లో ఇద్దరు వైస్ చైర్మన్ లను నియమిస్తామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్లుగా మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు

. ఇక ఇదే సమయంలో తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థి పై వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి. తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నిలబడతారని స్పష్టం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల్లోనూ వైసీపీ విజయభేరి

తిరుపతి ఉప ఎన్నికల్లోనూ వైసీపీ విజయభేరి

సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలానే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు.

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీ కే పట్టం కడుతున్నారని పేర్కొన్నారు . ఇక ఎస్ఈసి నిమ్మగడ్డ హయాంలోనే మిగతా ఎన్నికలు కూడా పూర్తి చెయ్యాలని కోరారు . జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని ఎస్ఈసిని కోరుతున్నామని చెప్పారు .

English summary
Minister peddireddy ramachandrareddy said that he was confident of securing a majority of up to three lakh votes in the Tirupati by-elections. Peddireddy Ramachandrareddy said that all the municipalities under Tirupati Lok Sabha have won by YCP . Peddireddy said that Dr. Gurumurthy is the YCP candidate in the Tirupati by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X