ఆ స్కీమ్ నమ్మితే లాభం.. ప్రతిపక్షాల అబద్ధాలు నమ్మితే నష్టం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది వరకు కొనసాగనున్న వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ గురించి ప్రజలకు స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నిరు పేదలకు మేలు చేసే ఓటిఎస్ పథకాన్ని విమర్శిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటిఎస్ పై ప్రతిపక్ష పార్టీలతో పాటుగా, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు.

అబద్దాలు చెప్పి నిజమని మోసం చేస్తున్న ప్రతిపక్షాలు
ఒక అబద్దం పదిసార్లు చెబితే నిజం అవుతుందన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్తున్న అబద్ధాలు నమ్మితే నష్టం తప్ప లాభం ఉండదని నిప్పులు చెరిగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఓటీఎస్ ను నమ్మితే లాభం జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. పల్లెల్లో ఉన్న ప్రజల అవగాహన లోపాన్ని స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉపయోగించుకుంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

వన్ టైం సెటిల్మెంట్ ను నమ్మితే లాభం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంస్కరణలలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తెచ్చారని, ఈ స్కీమ్ ను అందిపుచ్చుకోవడం ద్వారా పట్టా ఇచ్చి మరీ శాశ్వత గృహ హక్కు కల్పిస్తున్నారని, తద్వారా తాకట్టు పెట్టుకోవడానికి, రుణం తీసుకోవడానికి, అవసరమనుకుంటే అమ్ముకోవడానికి కూడా వీలు ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా కట్టకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుందని వెల్లడించారు. ఎవరితోనూ బలవంతంగా వన్ టైం సెటిల్మెంట్ కట్టమని చెప్పడం లేదన్నారు.

జగన్ హయాంలో హామీలన్నీ పూర్తి
పూర్తిగా స్వచ్ఛందంగా ప్రజలు ఓటీఎస్ చేసుకోవాలని జగన్ పిలుపునిచ్చారని ఆయన అన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న లోన్లు, వడ్డీతో సహా మాఫీ చేస్తూ తీసుకు వచ్చిన ఓటిఎస్ పథకాన్ని పట్టణాల్లో ఉన్న వారు ఎక్కువగా వినియోగించుకుంటున్నారని చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలన్నీ పూర్తి చేశారని, గ్రామాల్లోకి వెళితే కేవలం ఇళ్ల కోసం అర్జీలు, భూవివాదాలపై ఫిర్యాదులు మాత్రమే అందుతున్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. జగనన్న శాశ్వత గృహ హక్కు, భూ రక్షా పథకం సర్వే అనంతరం రాష్ట్రంలో ఎటువంటి భూ వివాదాలు ఉండవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు .

మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీనే
భూ సర్వే పై జగన్ తరచూ సమీక్ష నిర్వహిస్తున్నారని కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ అంశంపై కసరత్తు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. 2014లో రుణ మాఫీ చేస్తాం అని చెప్పి వడ్డీలు, అప్పులు కట్టొద్దు అని మహిళలకు చెప్పి మోసం చేశారని అప్పుడు 14 వేల కోట్ల రుణాలు ఇప్పుడు 25 వేల కోట్ల రుణాలుగా మారాయని మండిపడ్డారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మార్చే పరిస్థితి ఉండదన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications