ఏపీలో సినిమా టికెట్ ధరల రగడ: మీడియాకు వేరే పనేంలేదా; మంత్రి పేర్ని నాని అసహనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ వ్యవహారంపై హీరో నాని చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం సినీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, ఆపై సినీ వర్గాల పై వైసీపీ మంత్రులు విరుచుకుపడడంతో రచ్చగా మారింది. తాజాగా సినిమా టిక్కెట్ ధరల వ్యవహారంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత రాంగోపాల్ వర్మ పేర్నినాని తో భేటీ అయిన వ్యవహారం ఆసక్తికర చర్చకు దారితీసింది. నేటికీ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల విషయంలో మొదలైన వివాదం ఒక కొలిక్కి రాలేదు.

సినిమా టికెట్ల ధరలను పెంచాలని కోరిన ఎగ్జిబిటర్లు
తాజాగా సినిమా టికెట్ ధరలతో పాటుగా థియేటర్ ల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ మంగళవారం నాడు ఏపీ సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ విశ్వజిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సినిమా టికెట్ల ధరల పై, థియేటర్ ల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులపై ఎగ్జిబిటర్లు కమిటీ ముందు సమస్యలను వివరించారు. సినిమా థియేటర్ లలో నిబంధనలను అమలు చేసే విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరారు. ఇదే సమయంలో సినిమా టికెట్ల ధరలను పెంచాలని కూడా ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సినిమా టికెట్ ధరల తగ్గింపుతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల రగడ
ఇప్పటికే సినిమా టికెట్ల ధర తగ్గింపు విషయంలో తాము తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఉద్దేశించి తీసుకున్నామని వైసీపీ ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకుంది. దీంతో అటు సినీ వర్గాలకు వైసిపి ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య కూడా సినిమా టికెట్ల అంశం రగడ కొనసాగుతోంది. సినిమా టికెట్ల ధరలు తగ్గింపుపై ఇంటర్ శ్రద్ధ పెడుతున్న వైసీపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు తగ్గించటం లేదని, అలాగే సిమెంటు ధరలు ఎందుకు తగ్గించటంలేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

గుడివాడ ఎడ్ల బండ లాగుడు పోటీల బహుమతి ప్రధాన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని
ఇదిలా ఉంటే తాజాగా కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్ లోని కే కన్వెన్షన్ ఆవరణలో ఎన్టీఆర్ టు వైయస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజు రాత్రి పోటీల్లో తొలిరోజు విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి పేర్ని నాని పశుసంపదను, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేలా మంత్రి కొడాలి నాని సోదరులు ఐదేళ్లుగా ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారని అభినందించారు.

సినిమా టికెట్ల ధరలపై మంత్రిని అడిగిన మీడియాపై మంత్రి పేర్ని నాని అసహనం
ఎన్టీఆర్, వైయస్సార్ ల పేరుతో పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా విలేకరులు సినిమా టికెట్ల ధరలపై మంత్రి పేర్ని నానిని ప్రశ్నించగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా తప్ప వేరే పని ఏమీ లేదా అంటూ ప్రశ్నించారు. సినిమా టికెట్ల విషయం తప్ప రాష్ట్రంలో మీడియాకు వేరే పని ఏమీ లేకుండా పోయిందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రజలకు అవసరం అయిన విషయాలపై స్పందిస్తే మేలు జరుగుతుందని మంత్రి చురకలు
ప్రజలకు, వ్యవస్థలకు అవసరమైన విషయాలపై మీడియా స్పందిస్తే సమాజానికి మేలు జరుగుతుందని మంత్రి పేర్ని నాని మీడియా ప్రతినిధులకు చురకలంటించారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ధరల తగ్గింపు నిర్ణయానికి కట్టుబడి ఉండాలా లేక సినీ వర్గాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్న క్రమంలో మంత్రి పేర్ని నాని మీడియాపై అసహనం ప్రదర్శించారని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధరల రగడ తెలుగు టీవీ సీరియల్ ఎపిసోడ్స్ లా రోజుకో రకమైన మలుపులు తిరుగుతూ సాగుతూనే ఉంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications