వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేశ్‌పై మంత్రి పేర్ని నాని పంచ్‌లు-గడ్డం పెంచితే గబ్బర్ సింగ్ కాలేరు.. బూతులు మాట్లాడితే సీఎం కా

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేశ్‌ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని... ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుందని విమర్శించారు. గడ్డం పెంచినవాడల్లా గబ్బర్ సింగ్ కాలేడని... బూతులు మాట్లాడితే సీఎం కాలేడని... లోకేశ్ ఒక రాజకీయ నిరుద్యోగి అని ఎద్దేవా చేశారు. లోకేశ్ అసహనాన్ని చూస్తుంటే సానుభూతి కలుగుతోందని... చివరకు మహిళలపై అఘాయిత్యాలను కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

నారా లోకేశ్ అసభ్యంగా,విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని... తాము కూడా మాట తూలగలమని పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ రాకను కోరుతుండటంతో సొంత పార్టీలోనే లోకేశ్ ఉనికి కోసం తాపత్రయపడుతున్నారని అన్నారు. 'రావాలి జూనియర్ ఎన్టీఆర్... కావాలి జూనియర్ ఎన్టీఆర్' అని టీడీపీ కార్యకర్తలు అంటుండటంతో... జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు నేనే సరిపోతానని జగన్‌పై లోకేశ్ నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు.

 minister perni nani satirical comments on tdp leader nara lokesh

ఒకరకంగా లోకేశ్‌ను చూస్తుంటే జాలి కలుగుతోందని పేర్ని నాని అన్నారు. ఎన్టీఆర్‌ను బాబు వెన్నుపోటు పొడిచినట్లే... జూనియర్ ఎన్టీఆర్ పార్టీని లాక్కొంటారనే భయం లోకేశ్‌కు ఉందన్నారు. రాజకీయ నిరుద్యోగిగా మారిన లోకేశ్ మళ్లీ ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Recommended Video

MS Dhoni Spotted In Shimla, ఫ్యాన్స్ అడిగితే కాదనకుండా..!! || Oneindia Telugu

గుంటూరు జిల్లా తాడేపల్లిలో యువతిపై అత్యాచార ఘటనపై నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మీ ప్యాలెస్‌కి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగిందన్న సంగతి మీకు తెలుసా అంటూ లోకేశ్ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించే పోలీసులు ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఎక్కడపోయారని నిలదీశారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడన్నారు.. సీఎం ఇంటి దగ్గరే ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకమైందన్నారు.

English summary
AP Minister Perni Nani lambasted the TDP national general secretary Nara Lokesh. He said Lokesh is struggling within his own party as the TDP cadre were demanding the arrival of junior NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X