ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్, నిధుల జమ..!!
ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేసారు. తెలంగాణ ప్రభుత్వం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిల చెల్లింపుల కోసం రూ.2 వేల కోట్లను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల జీపీఎఫ్ బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ అమలులో భాగంగానే తొలి విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జీపీఎఫ్ బకాయిల చెల్లింపుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. మిగిలిన బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేసి, వంద రోజుల గడువులోపు మొత్తం రూ.6 వేల కోట్ల చెల్లింపులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. రిటైర్ అయిన ఉద్యోగుల చెల్లింపుల కోసం వంద రోజుల్లో 6000 కోట్లు విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఆచరణ రూపంలోకి తీసుకొచ్చారు.

ఉద్యోగుల బకాయిలు రూ 2 వేల కోట్ల విడుదల
ఉద్యోగుల సమస్యల పైన సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. కీలకమైన అంశాలపై స్పష్టతనిచ్చారు. ఇది ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించే ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పేర్కొన్న సీఎం, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ బకాయిల చెల్లింపుల కోసం రాబోయే 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని కీలక హామీ ఇచ్చారు. అలాగే కొత్త పీఆర్సీపై తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారుల కమిటీని ఆదేశించామని, ఆ రిపోర్టు ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు.













Click it and Unblock the Notifications