గేల్ అవుట్.. 'కాంప్లాన్ బాయ్' ఇన్.. పాక్‌లో కొత్త జపం!
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోతోంది. ఈ కుర్రాడి తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బకు భారత క్రికెట్ అభిమానులే కాదు, పొరుగు దేశం పాకిస్తాన్‌కు చెందిన మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు కూడా నోరెళ్లబెడుతున్నారు. పాక్ మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో వైభవ్‌ను ఆకాశానికెత్తేస్తూ.. అతడిని క్రికెట్ ప్రపంచపు తదుపరి సూపర్ స్టార్‌గా అభివర్ణించారు.
"గేల్ 'మిస్టర్ యూనివర్స్'.. ఈ 'కాంప్లాన్ బాయ్' అంతకంటే తోపు!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు (30 బంతుల్లో) క్రిస్ గేల్ పేరిట ఉంది. వైభవ్ కేవలం ఒకే ఒక్క షాట్ దూరంలో ఆ రికార్డును మిస్ చేసుకున్నప్పటికీ.. అతని ఆట తీరుకు బాసిత్ అలీ ఫిదా అయ్యాడు." వైభవ్‌ను 'కాంప్లాన్ బాయ్', 'బబ్లూ' అని ముద్దుగా పిలుస్తూ.."క్రిస్ గేల్‌ను అందరూ మిస్టర్ యూనివర్స్ అనేవారు, కానీ ఇప్పుడు ఈ చిన్న పిల్లోడు 'మిస్టర్ యూనివర్స్' అయిపోయాడు. కాంప్లాన్ తాగి ఆడే ఈ బబ్లూ రాబోయే రోజుల్లో గేల్ రికార్డులను కూడా బద్దలు కొడతాడు. ఈస్ట్ టు వెస్ట్.. సూర్యవంశీ ఈజ్ ద బెస్ట్! వీడు రేపు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే ప్రపంచాన్ని ఏలేస్తాడు" అని బాసిత్ అలీ చప్పట్లు కొడుతూ కొనియాడారు.

"మా హారిస్ రవూఫ్, షాహీన్ ఆఫ్రిదిలకు పడితే ఆరు సిక్సర్లే!"
పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రముఖ యూట్యూబ్ స్పోర్ట్స్ యాంకర్ మాట్లాడుతూ.. పాక్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం ఉన్నప్పటికీ.. అక్కడి జనాలు వీపీఎన్‌ల ద్వారా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసాన్ని ఎగబడి చూస్తున్నారని వెల్లడించాడు."మన స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్ లాంటి వాళ్లు వైభవ్ మాకేం పెద్ద లెక్క కాదు అన్నట్లు మాట్లాడుతుంటారు. కానీ దేవుడి దయ వల్ల.. ఒకవేళ ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వైభవ్‌కు షాహీన్ ఆఫ్రిది లేదా హారిస్ రవూఫ్ ఎదురైతే మాత్రం, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు పడడం ఖాయం. మన పాకిస్తాన్ క్రికెటర్లు ఈ 15 ఏళ్ల కుర్రాడిని చూసి కాస్త సిగ్గు తెచ్చుకోవాలి" అని సదరు యాంకర్ ఘాటుగా కామెంట్ చేశాడు
ప్యాట్ కమిన్స్‌ను కూడా ఉతికేసాడు.. గాల్లో నుంచి ఊడిపడ్డాడా?
పాకిస్తాన్ స్పోర్ట్స్ అనలిస్ట్ మహ్మద్ మోసిన్ స్పందిస్తూ.. తాను తన జీవితంలో ఇలాంటి మైండ్ బ్లోయింగ్ క్రికెట్ చూడలేదన్నారు. "సూర్యవంశీకి దేవుడు ఇచ్చిన అద్భుతమైన టాలెంట్ ఉంది. వరల్డ్ క్లాస్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌ను కూడా అతను చాలా సులభంగా ఆడేసాడు. ఒత్తిడి అనే పదం అతని డిక్షనరీలోనే లేదు. వరల్డ్ అంతా ఇప్పుడు షాక్‌లో ఉంది.. అసలు ఈ పిల్లోడు నిజంగా మనిషేనా లేక ఏఐ (AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా క్రియేట్ చేయబడిన ఆటగాడా? అని ఆశ్చర్యపోతున్నారు" అని మహ్మద్ మోసిన్ పేర్కొన్నారు. కరాచీకి చెందిన కొందరు అభిమానులు కూడా.. నేడు పాక్‌లో ఈద్ పండగ ఉన్నప్పటికీ, అందరూ వైభవ్ గురించే ముచ్చటించుకుంటున్నారని చెప్పారు.
వైభవ్ వయస్సుపై పాక్ సీనియర్ జర్నలిస్ట్ అనుమానాలు!
వైభవ్ సూర్యవంశీపై ఒకవైపు అపారమైన ప్రశంసలు కురుస్తుండగా, మరోవైపు అతని వయసుపై పాకిస్తాన్‌లో చర్చ మొదలైంది. పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ క్రీడా పాత్రికేయుడు అబ్దుల్ గఫార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వైభవ్‌కు కేవలం 15 ఏళ్లే అంటే తాను నమ్మలేకపోతున్నానని రాసుకొచ్చారు. "వైభవ్ సూర్యవంశీ డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్‌లో చేస్తున్నది చాలా గొప్ప విషయమే. కానీ నాకు వైభవ్ కేవలం 15 ఏళ్ల వయసున్న కుర్రాడిలా అనిపించడం లేదు. ఏదేమైనా అతని అసలైన పరీక్ష అంతర్జాతీయ క్రికెట్‌లో పిచ్‌లపై ఉంటుంది. నిజమైన పరీక్ష ముందుంది" అంటూ వైభవ్ వయసు, భవిష్యత్తుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications