కృష్ణా పుష్కరాలు: జగన్‌కు అవమానం, నిరాశగా వెనుదిరిగిన మంత్రి రావెల
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు హాజరు కావాలంటూ తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానాలు పలుకుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్‌ను ఆహ్వానించే బాధ్యత మంత్రి రావెలకు అప్పగించారు. అయితే ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కారణంగా ఆయన్ను పుష్కరాలకు ఆహ్వానించడం కుదరలేదు.
రిషికేశ్ పర్యటనను ముగించుకుని శుక్రవారం ఉదయం వైయస్ జగన్ హైదరాబాద్‌కు రానున్నారనే సమాచారం తెలియడంతో జగన్‌ను కలిసేందుకు మంత్రి రావెల యత్నించారు. అయితే ఢిల్లీ నుంచి రాగానే వైయస్ జగన్ అమలాపురం వెళ్లనున్నారని, ఈ క్రమంలో ఆయనను కలవడం కుదరదని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఇదేమీ పట్టించుకోకుండా కృష్ణా పుష్కరాల ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు ఇవ్వడానికి శుక్రవారం ఆయన నివాసానికి మంత్రి రావెల వెళ్లారు. జగన్ అమలాపురం వెళ్తున్నారని, సాయంత్రం వస్తారని కార్యాలయ సిబ్బంది చెప్పడంతో ఆయనను కలవడం కోసం మంత్రి, విప్ కూన రవికుమార్ హైదరాబాద్‌లోనే ఉండిపోయారు.

అమలాపురం నుంచి జగన శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. అది తెలిసి మంత్రి, కూన రవికుమార్ నేరుగా లోట్‌స్ పాండ్ వెళ్లారు. అయితే జగన్ ఇంట్లోనే ఉన్నా రోజంతా పర్యటన చేసివచ్చి అలసిపోయారని, ఇప్పుడు కలవరని వైసీపీ నేత పార్ధసారథి తెలిపారు. జగన్‌ను బద్నాం చేసేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా మంత్రి రావెల మాట్లాడుతూ గతంలో అమరావతి శంకుస్థాపనకు ప్రతిపక్ష నేతను ఆహ్వానించామని, కానీ ఆయన హాజరు కాలేకపోవడం మమ్మల్ని ఎంతో తీవ్రంగా బాధించిందని ఆయన అన్నారు. మరోవైపు వైసీపీ నేత పార్ధసారథి మాట్లాడుతూ జగన్ ఇంట్లో లేని సమయంలో వచ్చి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
జూనియర్ ఆర్టిస్టుల దగ్గరి నుంచి మెగాస్టార్ వరకు అందరికీ ఆహ్వానం పంపిన చంద్రబాబు, జగన్ కు మాత్రం పుష్కరాలు ప్రారంభమయ్యాక ఆహ్వానం పంపించి ఆయన్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఆర్టిస్టుల దగ్గరి నుంచి మెగాస్టార్ వరకు అందరికీ ఆహ్వానం పంపిన చంద్రబాబు, జగన్ కు మాత్రం పుష్కరాలు ప్రారంభమయ్యాక ఆహ్వానం పంపించి ఆయన్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో తిరిగి శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి రావెలతో పాటు ప్రభుత్వ విప్ కూన రవికుమార్... ప్రతిపక్ష నేత జగన్‌ను కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత వైయస్ జగన్ ఈ నెల 18న విజయవాడలో పుష్కర స్నానమాచరించనున్నారు.












Click it and Unblock the Notifications