డ్యాన్సులతో దుమ్ము రేపుతున్న మంత్రి రోజా.. సాంస్కృతిక శాఖకు అదిరిపోయే పబ్లిసిటీ

మంత్రి రోజా ఏం చేసినా సెన్సేషనే.. కబడ్డీ ఆడినా, ఆటపాటల్లో అయినా ఎప్పుడు రోజా పై చర్చ జరగాల్సిందే. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఆర్.కె.రోజా, ఆ శాఖకు పూర్తిగా న్యాయం చేస్తున్నారని ఆమె చేసే చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగనన్న సాంస్కృతిక సంబరాలలో మంత్రి రోజా సందడితో ఏపీ సాంస్కృతిక శాఖకు విపరీతమైన ప్రచారం దొరుకుతుంది. జగన్ ఆమెకు సరైన శాఖ కేటాయించారు అని అంతా భావిస్తున్నారు. తాజాగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలలో దుమ్ము లేపిన రోజా డ్యాన్సుల వీడియో వైరల్ కావడంతో మరోమారు హాట్ టాపిక్ అయ్యారు.

మంత్రి అయినా సినిమా జోష్ తగ్గని రోజా


వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా లో మంత్రి అయినా ఇంకా సినిమా జోష్ ఆమెలో ఏ మాత్రం తగ్గటం లేదు. ఎక్కడ పాట వినిపించినా, సరదాగా స్టెప్పులేసి రోజా తాజాగా అరకులోయలో గిరిజన సాంప్రదాయ నృత్యాలను ప్రసిద్ధిపొందిన దింసా నృత్యం చేసి అందరిని ఆకట్టుకున్నారు. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలలో పాల్గొంటున్న రోజా తాను కూడా భాగస్వామ్యం తీసుకోవడంతో ఆయా ప్రదర్శనలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. తాజాగా తప్పెటగుళ్ళు వాయిస్తూ కళాకారులతో కలిసి సందడి చేసిన రోజా, గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన దింసా డాన్స్ ను అదరగొట్టేసారు.

జగనన్న సాంస్కృతిక సంబరాలలో మంత్రి రోజా సందడి.. తప్పెట గుళ్ళు వాయిస్తూ రోజా

విశాఖపట్నంలో జరిగిన జగనన్న సాంస్కృతిక సంబరాలలో మంత్రి రోజా సందడి చేశారు. తప్పెటగుళ్ళు వాయిస్తూ తప్పెటగుళ్ళు గురించి, దింసా నృత్యం చేస్తూ దింసా నృత్యం విశిష్టతను రోజా తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా తన వీడియో తో పాటు ఆయా కళారూపాల యొక్క గొప్పతనాన్ని స్పష్టం చేస్తున్న రోజా తప్పెట గుళ్ళు -జానపద సంగీత నాట్య దృశ్య రూపకం అని పేర్కొన్నారు. రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెట వాయిద్య పరికరాన్ని రొమ్ములపై కట్టుకుని రెండు చేతులతోనూ వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తూ, కాళ్ళకు గజ్జెలు కట్టి, కేకలతో కేరింతాలు కొడుతూ, ఆనందంతో వలయాకారంగా తిరుగుతూ చేసే కట్టు దిట్తమైన శాస్త్రీయ జానపద నృత్య కళ అని పేర్కొన్నారు. ఇక కళాకారులతో కలిసి తాను తప్పెటగుళ్ళు వాయించిన వీడియోలు రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దింసా డ్యాన్స్ చేసిన రోజా వీడియోలు వైరల్


తాజాగా గిరిజనుల సంప్రదాయ నృత్యం అయిన దింసా నృత్యం చేసిన రోజా, వారితో కలిసి సరదాగా ఆడారు. ఇక ఆ వీడియోను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దింసా నృత్యం యొక్క గొప్పతనాన్ని రోజా చెప్పారు. దింసా -అరకు లోయలోని గిరిజనుల సాంప్రదాయ నృత్యాలలో ప్రసిద్ధమైనదని రోజా పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులు సామూహికంగా నర్తించే దింసా నృత్యం దేశంలో విశేషాదరణ పొందిందన్నారు మంత్రి రోజా. వాల్మీకులు, బగతలు, కోటియా, ఖోండ్, కొలాములు, మూఖ దొరలు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ దింసా నృత్యం చేయడం లో పాల్గొంటారని రోజా పేర్కొన్నారు. ఆపై ప్రతిభ కనబరిచిన కళాకారులకు బహుమతులు అందజేసిన రోజా ఎంతో సంతోషంగా ఈ ఉత్సవాలలో పాల్గొంటూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.

జగన్ పుట్టినరోజు సందర్భంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు

జగన్ పుట్టినరోజు సందర్భంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు

డిసెంబర్ 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకలను ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్వహిస్తున్న రోజా ప్రతి చోట తన ఆటపాటలతో వేడుకలను హైలెట్ చేస్తున్నారు. రోజా డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కావడంతో, ఈ సాంస్కృతిక ఉత్సవాలపై అందరి దృష్టీ ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఇక రోజా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ సీఎం జగన్ రోజాకు కరెక్ట్ గా సరిపోయే శాఖను ఇచ్చారని చర్చిస్తున్నారు. ఆమె శాఖకు ఆమెనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+