అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నందమూరి కుటుంబం ఆ విషయాన్ని గుర్తించలేకపోతోంది?

యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారన్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

తండ్రి ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడంటూ మంత్రి రోజా నారా లోకేష్ పై మండిపడ్డారు. చిత్తూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజా లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువగళం కాదని, ఒంటరి గళమని ఎద్దేవా చేశారు. లోకేష్ చేసిన డైమండ్ రాణి వ్యాఖ్యలపై రోజా విరుచుకుపడ్డారు. నారా లోకేష్ అంకుల్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారన్నారు. ఏపీకి ఏం చేయాలి? ప్రజలకు ఏం చేయాలి? అనే విషయంలో వారికి స్పష్టత లేదన్నారు.

ఒకవైపు తన తండ్రి చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని వేధించినా, జగన్ ఆత్మసైర్థ్యంతో పాదయాత్రను ప్రారంభించారని, పేదల కష్టాలను వింటూ అధికారంలో వచ్చారని రోజా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలను ముఖ్యమంత్రి తీరుస్తున్నారని, ఆ ధైర్యంతోనే మళ్లీ ఓట్లు అడుగుతున్నామన్నారు. తన తండ్రి మరణించినా ఆత్మస్థైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఎవరూ చేయనంత దూరం 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, ఆ సమయంలోనే ప్రజల కష్టాలను దగ్గరుండి చూశారని, వాటిని ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కరిస్తున్నారన్నారు.

minister roja fire on nara lokesh

అవసరమైనప్పుడల్లా తండ్రీ కొడుకులు నందమూరి కుటుంబాన్ని వాడుకొని, అధికారంలోకి వచ్చాక వాళ్లను విస్మరిస్తున్నారని, కానీ ఈ విషయాన్ని నందమూరి కుటుంబం గుర్తించలేకపోతోందన్నారు. పాదయాత్రలో కనీసం పదిమంది కూడా లేరని ఎద్దేవా చేశారు. లోకేష్ సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే కనీసం 10 మంది కూడా లేరని, ఆయన విఫలనేత అన్నారు. నాయకుడిగా లోకేష్ 100 శాతం ఫెయిలయ్యారని, అది గుర్తించే మంగళగిరి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదన్నారు. మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడంటూ మరోసారి ఘాటు విమర్శలు చేశారు.

English summary
Minister Roja Nara lashed out at Lokesh saying that even though his father was the Chief Minister, he could not win at least as an MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X