భువనేశ్వరి, పురందేశ్వరి పై రోజా కీలక వ్యాఖ్యలు - తర్వాత అరెస్టయ్యేది వీరిద్దరే..!!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇదే అంశంపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేసారు. తప్పు చేసిన చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి దేవుడిని వేడుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించిన రోజా..అలా చేస్తే కేసు నిలబడదని తెలియదా అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో మరో ఇద్దరు
అరెస్ట్ తప్పదంటూ సంచలనానికి కారణమయ్యారు.
మంత్రి రోజా కామెంట్స్ : చంద్రబాబు అరెస్ట్..విచారణ వేళ మంత్రి రోజా కామెంట్స్ సంచలనంగా మారాయి. స్కిల్ స్కాంలో ఈడీ విచారణ కూడా జరిగుతోందని గుర్తు చేసారు. చంద్రబాబు పైన ఆధారాలు లేకపోతే అరెస్ట్ ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెలకు తన తండ్రిని హిసించినా..ఎటువంటి ఎమోషన్స్ లేవని..తండ్రి మీద ప్రేమ లేదంటూ రోజా కీలక వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు..లోకేశ్ షెల్ కంపెనీల ద్వారా దొంగ ఇన్వాయిస్ లతో అక్రమంగా సొమ్మ తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని రోజా ారోపించారు. తప్పు చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయద్దంటే ఎలా అని ప్రశ్నించారు. సామాన్యుడు అయినా..చంద్రబాబు అయినా తప్పు చేస్తే ఒకటేనని రోజా చెప్పుకొచ్చారు.
విధి సమాధానం చెప్పింది : చంద్రబాబును అరెస్ట్ చేయటం పైన ప్రజలు హ్యపీగా ఫీలవుతున్నారని పేర్కొన్నారు. కేసులు బనాయించాలని అనుకుంటే ఎవరి వల్లా కాదన్నారు. అలా చేస్తే కేసు నిలబడదని పేర్కొన్నారు. విచారణలో వచ్చే సమాచారం..ఆధారాలతో ముందుకు వెళ్తారని చెప్పుకొచ్చారు. అమరావతిలో చంద్రబాబు, లోకేశ్ బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారని ఆరోపించారు.
భువనేశ్వరి దేవుడి దగ్గరకు వెళ్లి భర్తను కాపాడమని వేడుకున్నారని..ప్రజల డబ్బును దోచుకొని మీరు హ్యాపీగా ఉండటం కోసం ప్రజలంతా ప్రార్ధనలు చేయాలా అంటూ రోజా ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ ను వేధించిన వ్యక్తిని ఇప్పుడు విధి సమాధానం చెప్పిందని రోజా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు మనశ్శాంతి దక్కిందన్నారు. నిర్మలా సీతారామణ్ చెప్పిన లెక్కలను పురందేశ్వరి తారుమారు చేసి సీఎం పై ఆరోపణలు చేసారని మండిపడ్డారు.

ఆ ఇద్దరూ అరెస్ట్ ఖాయం : చంద్రబాబుకు నోటీసులు ఇస్తే స్పందించను అని చెప్పిన పురందేశ్వరి..బావను కాపాడుకోవటానికి పార్టీని తాకట్టుపెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. బాలయ్య తన ఇంట్లో జరిగిన కాల్పుల వేళ మెంటల్ సర్టిఫికెట్ తో బయటపడ్డారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అందరి కాళ్లు పట్టుకొని కేసుల నుంచి బయట పడ్డారని..జగన్ ఎక్కడా రాజీ పడలేదన్నారు.
కేసులు బనాయించినా , ప్రజల మనసు గెలుచుకొని ప్రజల మధ్య వచ్చి గెలుపొందారని చెప్పుకొచ్చారు. పవన్ చేస్తున్న డ్రామాతో లోకేశ్ కే అనుమానాలు వస్తున్నాయని రోజా వ్యాఖ్యానించారు. అలిపిరిలో బాంబులు వేస్తేనే చంద్రబాబు పైన సానుభూతి రాలేదన్నారు. తరువాత లోకేశ్..అచ్చెన్నాయుడు అరెస్ట్ అవుతారంటూ రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.












Click it and Unblock the Notifications