మోడీతో జగన్ ను చూసి.. భీమ్లానాయక్ బిగుసుకుపోయాడు; చంద్రబాబు, లోకేష్ నీరుగారిపోయారు: మంత్రి రోజా
ఏపీ మంత్రి రోజా మంత్రి హోదాలో అల్లూరి జయంతి ఉత్సవాలను దగ్గరుండి నిర్వహించడంతో మంచి దూకుడు మీద ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్మోహన్ రెడ్డి, చిరంజీవి తదితరులతో కలిసి వేదిక పంచుకున్న రోజా ఆ తర్వాత అల్లూరి జయంతి ఉత్సవాల నిర్వహణపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ పవర్ ఫుల్ పంచ్ లు వేశారు.

టీడీపీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా సంస్థలు
నానాటికీ అధః పాతాళానికి పడిపోతున్న టిడిపిని జాకీలు పెట్టి పైకి లేపడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , అలాగే ఎల్లో మీడియా సంస్థలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయని మంత్రి రోజా పేర్కొన్నారు. అయితే టీడీపీ ని పైకి లేపాలని జాకీలు పెట్టి ఎంత ప్రయత్నం చేస్తున్నా అవి కూడా విరిగిపోతున్నాయి అంటూ రోజా సెటైర్లు వేశారు. రాజకీయాలకు, రికమండేషన్ లకు తావులేకుండా ఏపీలో జగనన్న పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రతి పేద కుటుంబానికి సొంత కొడుకులా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అందిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.

సచివాలయాలు, వాలంటీర్ ల వ్యవస్థ రద్దు చేస్తామని టీడీపీ నేతలు మాట్లాడటం దుర్మార్గం
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, ఆర్ బి కె లు, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన సేవలను నేరుగా అందిస్తున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని మంత్రి రోజా పేర్కొన్నారు. అంతేకాదు టిడిపి అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇక వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామంటూ మరో నాయకుడు మాట్లాడటం దుర్మార్గమని మంత్రి రోజా మండిపడ్డారు.

భీమ్లానాయక్ బిగుసుకుపోయాడు.. చంద్రబాబు, లోకేష్ నీరుగారిపోయారు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సీఎం జగన్ ప్రారంభించిన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్న రోజా దీంతో భీమ్లానాయక్ బిగుసుకుపోయాడు అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. సీఎం జగన్ పై అక్కసుతో ఉన్న భీమ్లానాయక్ ప్రధాని మోడీతో, సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసి బిగుసుకుపోయాడని వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబు, లోకేష్ లు నీరుగారి పోయారని రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

ప్రధాని పర్యటన సక్సెస్.. రోజా మార్క్ జోష్ .. ప్రతిపక్షాలపై సెటైర్లు
మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జగన్నాధపురం లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లను ప్రారంభించిన రోజా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం అయిందని భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ జోష్ లో ఉన్న రోజా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో పంచ్ లు వేశారు.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications