Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ ఓ జంబలకిడిపంబ పార్టీ; జగన్ కటౌట్ చూస్తే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి: రోజా

గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వద్ద జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో మంత్రి రోజా తెలుగుదేశం పార్టీపై, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కటౌట్ ని చూస్తే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న రోజా, వైఎస్ఆర్సిపి జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసిన రోజా తెలుగుదేశం పార్టీ ఒక జంబలకడిపంబ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీలో ఆడవాళ్ళు తొడకొడితే మగవాళ్ళు ఏడుస్తారన్న రోజా

టీడీపీలో ఆడవాళ్ళు తొడకొడితే మగవాళ్ళు ఏడుస్తారన్న రోజా


తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్లు తొడ కొడతారని, మగవాళ్లు ఏడుస్తారు అని, అదొక జంబలకడిపంబ పార్టీ అంటూ ఎద్దేవా చేసిన రోజా, చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. వైసీపీ ప్లీనరీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు తొడ కొడితే చంద్రబాబుకు హార్ట్ఎటాక్ వస్తుందంటూ రోజా సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడానికి గుంపులుగుంపులుగా కాకుండా, సింగిల్ గా రావాలంటూ రోజా సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ఆశయం కోసం పోరాడే పులి లాంటి వాడని రోజా కితాబిచ్చారు

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదన్న రోజా

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదన్న రోజా


జగన్, పవన్ కళ్యాణ్ లు కలిసి కాకుండా విడివిడిగా పోటీ చేయగలరా అంటూ రోజా సవాల్ విసిరారు. జనసేన పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థులు లేరని పేర్కొన్న రోజా తెలుగుదేశం పార్టీకి 60 స్థానాలు అభ్యర్థులు లేరని స్వయంగా లోకేష్ ఒప్పుకున్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన రోజా పవన్ కళ్యాణ్ రీల్ స్టార్ అయితే జగన్ రియల్ స్టార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

 వెన్ను చూపని.. పోరాడే దమ్మున్న నాయకుడు జగన్

వెన్ను చూపని.. పోరాడే దమ్మున్న నాయకుడు జగన్


వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు జగన్ అని పేర్కొన్న రోజా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుండి రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి, సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు అంటూ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను నేరుగా కళ్లారా చూశారని తనకు ఓటు వేసినా, వేయకున్నా పేదవాడి కష్టం తీర్చాలని జగన్ నిర్ణయించుకున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.

 తెలంగాణా ఘటనకు చలించి ఏపీలో దిశా చట్టం తెచ్చారు జగన్

తెలంగాణా ఘటనకు చలించి ఏపీలో దిశా చట్టం తెచ్చారు జగన్


అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటనకు చలించిన వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకు వచ్చారని రోజా పేర్కొన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు అరికట్టడం కోసం దిశ యాప్ ను తీసుకు వచ్చారని గుర్తుచేశారు. పోక్సో కేసులను త్వరితగతిన విచారించడం కోసం 12 పోక్సో కోర్టు లను అందుబాటులోకి తెచ్చినట్లు రోజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి ఆడబిడ్డ కన్నీటిని జగన్ తుడుస్తున్నారని పేర్కొన్న రోజా, మహిళా సాధికారతకు మూడేళ్ల జగన్ పాలనే నిదర్శనం అని మంత్రి రోజా వెల్లడించారు.

 సోనియాగాంధీనే గడగడలాడించిన పార్టీ వైసీపీ

సోనియాగాంధీనే గడగడలాడించిన పార్టీ వైసీపీ


సోనియాగాంధీనే గడగడలాడించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు మంత్రి రోజా. రాజ్యాధికారానికి మానవత్వం అద్దిన నాయకుడు వైయస్సార్ అని, ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడని మంత్రి రోజా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లోనే పోరాటం ఉందని పౌరుషం ఉందని రోజా తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+