పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!!

Minister Roja: జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా పవన్ తాను 20 ఏళ్ల తరువాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీసు చేస్తున్న ఫొటో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసారు. ఈ ఫొటో పైన మంత్రి రోజా స్పందించారు. కొద్ది రోజులుగా పవన్ తన ప్రచార వాహనం వరాహాను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ వాహనం పైన వైసీపీ నేతల వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. దీనికి పవన్ తో సహా జనసేన నేతలు స్పందించారు. పవన్ తాను ఏం చేసినా అడ్డుకుంటున్నారని..తాను శ్వాస తీసుకోవాలా వద్దా అంటూ ప్రశ్నించారు.

కత్తి పట్టుకొని పిచ్చి ట్వీట్లు

కత్తి పట్టుకొని పిచ్చి ట్వీట్లు

వపన్ వ్యాఖ్యల పైన మంత్రి రోజా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పవన్ వాహనం వారాహి కాదని.. అది నారాహి అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎవరి పైన యుద్దం చేయాలో అర్దం కాని పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కత్తి పట్టుకొని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్ ఎవరి సైన్యంలోనో దూరి యుద్దం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీ ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి కనీసం అభ్యర్ధులను నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ చేసే కామెంట్స్ కు సీఎం జగన్ స్పందించాల్సిన అవసరం లేదని రోజా పేర్కొన్నారు. పవన్ కు అవసరంగా ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, పవన్ తాను శ్వాస తీసుకోవాలా వద్దా అంటూ ప్రశ్నించటం పైన రోజా స్పందించారు.

అది తెలంగాణ సీఎం చెప్పాలి

అది తెలంగాణ సీఎం చెప్పాలి

పవన్ కల్యాణ్ తాను శ్వాస తీసుకోవాలా వద్దా అనేది చెప్పాల్సింది తెలంగాణ సీఎం కేసీఆర్..మంత్రి కేటీఆర్ అని రోజా వ్యాఖ్యానించారు. పవన్ ఉంటుంది పొరుగు రాష్ట్రంలోనని గుర్తు చేసారు. చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు తాపత్రయ పడుతున్నారని ఎద్దేవా చేసారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల తరువాత చంద్రబాబు - పవన్ ను సీఎం జగన్ హైదరాబాద్ కు పంపటం ఖాయమని చెప్పుకొచ్చారు. దత్తపుడ్రుడు ఒక ప్యాకేజీ స్టార్ అని ధ్వజమెత్తారు.

పవన్ కు రాష్ట్రంపై అభిమానం లేదు

పవన్ కు రాష్ట్రంపై అభిమానం లేదు

పవన్ కు ఏపీ పైనా.. ప్రజల పైనా అభిమానం లేదని రోజా వ్యాఖ్యానించారు. పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందని.. 2023లో మొదటి స్థానంలో నిలుపుతామని మంత్రి రోజా తెలిపారు. ఐటీపీఐ, టూరిజం అథారిటీ నేతృత్వంలో ఏపీ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై సౌత్ జోన్ సదస్సు తిరుపతిలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వా మ్యంతో తీర ప్రాంత అభవృద్ధి చేస్తామన్నారు.

కొత్త జనరేషన్ పర్యాటక ప్రాంతాలు పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారని రోజా పెర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఇప్పుడు రోజా వ్యాఖ్యల పైన జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+