పురందేశ్వరి జగత్ కిలాడీ.. బావ కళ్ళలో ఆనందం కోసమే లేఖలు: ఘాటుగా మంత్రి రోజా!!

ఏపీ మంత్రి రోజా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రైతు ద్రోహి చంద్రబాబు అని పేర్కొన్న రోజా, స్కీములను స్కాములుగా వాడుకున్న ఘనత చంద్రబాబుదే నని ఆరోపించారు. రెయిన్ గన్ లతో ఎక్కడైనా కరువు జయించగలమా , రెయిన్ గన్ లతో వేలాది ఎకరాలు పండించగలమా అంటూ రోజా ప్రశ్నించారు.

చంద్రబాబు రెయిన్ గన్ ల విషయంలో కూడా జైలుకు పోతాడని రోజా పేర్కొన్నారు. ఆయనపై కేసులు కచ్చితంగా నమోదు అవుతాయని రోజా వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది రూపాయలను ప్రజలకు ఇస్తున్నారని పేర్కొన్న రోజా, చంద్రబాబు ప్రజలను నిలువు దోపిడీ చేశాడంటూ ఆరోపించారు.

Minister roja shocking comments on purandeswari and chandrababu naidu

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పై మండిపడిన మంత్రి రోజా ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కేసులపై కక్ష సాధింపులో భాగంగా సుప్రీంకోర్టుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి లేఖలు రాశారని మంత్రి రోజా మండిపడ్డారు. జగన్ కేసుల గురించి లేఖలు రాయాల్సిన అవసరం ఆమెకు లేదని, ఆమె పని ఆమె చూసుకుంటే సరిపోతుంది అంటూ రోజా చురకలు అంటించారు.

తన కేసులను విచారించాలని పిటిషన్ పెట్టుకున్న దమ్మున్న నాయకుడు జగన్ అని మంత్రి రోజా పేర్కొన్నారు. పురందేశ్వరికి ఒక నియోజకవర్గం లేదని ఆమెను చూసి ఓటేసే వాళ్లు కూడా లేరని రోజా సెటైర్లు వేశారు. బావ కళ్ళలో ఆనందం కోసం పురందేశ్వరి లేఖలు రాస్తున్నారని మండిపడిన రోజా పురందేశ్వరి ఒక జగత్ కిలాడి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పురందేశ్వరి లాంటి నీతిమాలిన నాయకురాలిని తను చూడలేదన్నారు. ఎన్టీఆర్ బ్రతికున్న రోజుల్లో ఎప్పుడైనా పురందేశ్వరి ఆయనకు అన్నం పెట్టి, నీళ్ళు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పురందేశ్వరి లాంటి కూతురు పుట్టిందని ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడ్చి ఉంటారు అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. పురందేశ్వరి లాంటి జగత్ కిలాడి కూతురుగా ఎవరికి పుట్టకూడదు అని కోరుకుంటున్నానని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+