జైలర్ డైలాగ్ తో హోరెత్తించిన రోజా - అప్పుడు జగన్ ను చూడాల్సిందే..!!

మంత్రి రోజా పంచులతో చెలరేగారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే జైలర్ సినిమా డైలాగులతో పవన్ కళ్యాణ్, లోకేష్ ను టార్గెట్ చేశారు. నగరి సభలోనే సీఎంకు రాఖీ కట్టారు జగన్‌ను ఓడించేవారు ఇంకా పుట్టలేదంటూ రోజా జోష్ పెంచారు.

మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో సీఎం జగన్ పర్యటించారు. నిధులను విడుదల చేశారు. ఈ సభలో మంత్రి రోజా పంచులు జగన్ పైన ప్రశంసలతో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ నేత నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఊరూరా తిరిగి జగన్ ను విమర్శిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఇదే సమయంలో జైలర్ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ చెప్పటంతో సభ హోరెత్తింది.

Minister Roja targets Pawan Kalyan and Lokesh with Rajinikanth dialogue from jailer movie, video goes viral

మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు లేని ఊరే లేదు.. అంటూ రోజా తమిళంలోనూ ఆ డైలాగులను రిపీట్ చేశారు. అర్థమైందా రాజా అంటూ రోజా చెప్పిన డైలాగ్ కు భారీ స్పందన కనిపించింది.ఆ సమయంలో సీఎం జగన్ కూడా ఆ డైలాగును వింటూ ఆస్వాదించారు. నవ్వుతూ రోజా ప్రసంగాన్ని ఆసక్తితో విన్నారు.

Minister Roja targets Pawan Kalyan and Lokesh with Rajinikanth dialogue from jailer movie, video goes viral

ఇంటర్లో తాను ఏ గ్రూపు చదివాడో కూడా పవన్ కళ్యాణ్ కు తెలియదని రోజా సెటైర్ వేశారు. బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని, అటువంటి పవన్ చంద్రబాబు లకు కూడా విద్యా కానుక ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు.విద్యా దీవెనతో చంద్రబాబు పవన్ కు మంచి చదువు చెప్పించాలని సెటైర్ వేశారు. టీడీపీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తారని చెప్పుకొచ్చారు.పవన్ ని నమ్ముకుంటే యువత రిలీజ్ సినిమాలకు వెళ్తారని,అదే సీఎం జగన్ ని నమ్ముకుంటే మంచి కాలేజీలు వర్సిటీలకు వెళ్తారని అన్నారు.

Minister Roja targets Pawan Kalyan and Lokesh with Rajinikanth dialogue from jailer movie, video goes viral

ముఖ్యమంత్రి జగన్‌ని చూసి పవన్ కళ్యాణ్ జలసీ ఫీల్ అవుతున్నారని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో సహవాసం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు జగన్ పైన అసూయ పెరిగిందన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఆ మంచి వైద్యం చేయించాలని మంత్రి రోజా సీఎంను కోరారు. రీల్ హీరోలు ఎంతమంది వచ్చినా రియల్ హీరోల ముందు నిలబడలేరని రోజా పంచ్ వేశారు. 2024 జగన్ అన్న వన్స్ మోర్ అంటూ రోజా నినదించారు. విద్యారంగంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని రోజా పేర్కొన్నారు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని,ఏపీలో విద్యారంగాన్ని సాక్షాత్తు ప్రధాని ప్రశంసించారని రోజా చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+