శకునిలా, శిఖండిలా జగన్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ మంత్రి సవాల్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గెలిచే దమ్ము లేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.అమరావతిలో మాట్లాడుతూ సత్యకుమార్ యాదవ్.. రాజకీయాల్లో జగన్ ఒక శకునిలా వ్యవహరిస్తున్నారని, తెరవెనుక శిఖండిలా పనిచేస్తున్నారని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో తనపై అక్రమాలు జరిగాయని చెప్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే సొంత మీడియా ద్వారా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. మరో 24 గంటల్లో వైసీపీ భూస్థాపితం అయిపోతుందని, కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు.మేనమామగా కనీస బాధ్యతను కూడా నెరవేర్చలేని వ్యక్తి ఇతరులకు నీతులు చెబుతున్నారా అని ప్రశ్నించారు.

Minister Satya Kumar Yadav Challenges ys Jagan - Prove Irregularities and I Will Resign

సొంత తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తికి విమర్శించే నైతిక హక్కు ఎక్కడుందని అన్నారు. వైశ్యులను రాజకీయ పావులుగా వాడుకోవడం వైసీపీ రాజకీయ రాక్షస క్రీడకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. చేనేత కార్మికులపై దాడులు చేసిన నేతలు ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.గత వైసీపీ పాలనలో జరిగిన దళిత డాక్టర్ సుధాకర్ ఘటన, డోర్ డెలివరీ హత్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు.

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక!
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక!

పచ్చి ఆర్థిక నేరగాడు అయిన జగన్ ప్రత్యర్థులు డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఆరోపించడం విడ్డూరమన్నారు. అనవసర వివాదాలు మానుకుని గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి. కూటమి ప్రభుత్వం గత పాలనపై ప్రజల్లో అసంతృప్తిని గుర్తు చేస్తూ ప్రచారం చేయగా, అదే సమయంలో వైసీపీ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.

ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు రాజకీయ చర్చను మరింత వేడెక్కించాయి. తనపై జగన్ చేసిన అక్రమాల వ్యాఖ్యలకు మంత్రి విసిరిన సవాల్‌కు జగన్ లేదా వైసీపీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+