ఏపీ ఆఫర్: ఉద్యోగులకు వారం ఉచిత భోజనం, హైదరాబాద్ కంటే భేష్
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతన కార్యాలయాల ప్రారంభోత్సవం సోమవారం జరుగుతోంది. ఈ రోజు పదిహేను కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. మంత్రి అయ్యన్న పాత్రుడు పంచాయతీరాజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వారం రోజుల్లో విజయవాడ నుంచే పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు జరుపుతామని చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగులకు అందించే వసతుల పట్ల స్పష్టత ఉందని, వారికి అక్కడ ఎటవంటి ఇబ్బందులు ఉండవన్నారు. వారం రోజుల పాటు ఉద్యోగులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామన్నారు.
హైదరాబాద్ కంటే సౌకర్యాలు మెరుగు
ఏపీఎస్ ఆర్టీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు సోమవారం విజయవాడ నుంచి ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కార్యాలయాన్ని సంస్థ ఎండీ సాంబశివ రావు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కంటే ఇక్కడే సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని ఉద్యోగులు అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు నెలరోజుల పాటు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు.

ఇప్పటికే 25, ఇప్పుడు 15
సోమవారం నుంచి రాజధాని ప్రాంతం నుంచే పరిపాలన కొనసాగించాలన్న ప్రభుత్వం ఆదేశాలతో అన్ని శాఖల కార్యాలయాల ప్రారంభం ఊపందుకుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే 25కి పైగా కార్యాలయాలు ఏర్పాటు కాగా, సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాలో మరో 15 కార్యాలయాలు ప్రారంభం కావడం విశేషం.
మళ్లీ టిడిపి ఎందుకు గెలుస్తుందో చెప్పిన జేసీ, బెజవాడలో ఏ ఆఫీస్ ఎక్కడ?హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి తరలివచ్చిన ఉద్యోగులకు మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు చేరువగా పరిపాలన సాగించేందుకు అంతా రాజధానికి తరలిరావాలని ముఖ్యమంత్రి పిలుపును అంతా స్వాగతించామని, ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా పాటుపడతామన్నారు.












Click it and Unblock the Notifications