ఇదీ వైసీపీ హత్యల జాబితా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుంచి రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ముఖ్యంగా హోం మంత్రి వంగలపూడి అనితకు తలనొప్పిగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా బాలికలపై జరిగిన అత్యాచారాలు, హత్యలతోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న హోంమంత్రికి, తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య ఘటన, పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటన తలనొప్పి తెచ్చిపెట్టాయి.

క్రిమినల్స్ ఏ పార్టీ వారైనా యాక్షన్
ఈ క్రమంలో ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణ గురించి, గత వైసీపీ హయాంలో హత్యల గురించి మాట్లాడిన వంగలపూడి అనిత ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించకుండా సంయమనం పాటించాలన్నారు . రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్న వంగలపూడి అనిత అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణన లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.

Minister vangalapudi Anitha shocking comments on ys Jagan and ycp govt regime murders

జగన్ సైకో పాలన
శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని మంత్రి అనిత పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ పాలన పైన మండిపడిన అనిత సైకో జగన్ పాలనలో శాంతిభద్రతలను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

అరాచక శక్తులను రెచ్చగొడుతున్నారన్నారు
గత ఐదేళ్లలో టిడిపి, జనసేన, బిజెపితో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని అనిత గుర్తు చేశారు. చంద్రబాబు పవన్ వంటి నాయకులకే ఇబ్బందులు ఎదురయ్యాయి అని గుర్తు చేసిన అనిత టిడిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతును ఓర్చుకోలేకనే అరాచక శక్తులను రెచ్చగొడుతున్నారన్నారు. టిడిపి వైసిపి రెండు పార్టీలకు అప్పీల్ చేస్తున్నానని పేర్కొన్న మంత్రి అనిత చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదని సూచించారు.

జగన్ ఆ హత్యలను ప్రస్తావించు
జగన్ రాష్ట్రపతికి, హోంమంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, సుధాకర్ హత్య కేసు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసుతో సహా నాటి వివిధ ఘటనలను ప్రస్తావించారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

ఆయా శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్
మహిళా, శిశు సంక్షేమ, విద్యా, పోలీసు శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ కు కమిటీని నియమించి, విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులకు కూడా అత్యాచారాలకు ఆస్కారం ఉన్న కారణాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+