వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయపడి కాదు, కిరణ్ వస్తే 200కోట్లు వచ్చేవి: జగ్గారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికో భయపడి మెదక్ జిల్లా సదాశివపేటలో తన రచ్చబండ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోలేదని ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసన సభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గా రెడ్డి) మంగళవారం అన్నారు. కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి వస్తే రూ.200 కోట్లు జిల్లాకు వచ్చేవని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలకు భయపడి రచ్చబండను వాయిదా వేయలేదని, అదిలాబాదులో కృతజ్ఞత సభ ఉన్నందున జిల్లా మంత్రులు కోరడంతో వాయిదా పడిందన్నారు. త్వరలో సంగారెడ్డిలో లక్ష మందితో సభ పెడతానని, దానికి ముఖ్యమంత్రి వస్తారన్నారు.

రాష్ట్రం విడిపోదు: కొండ్రు

రాష్ట్రం విడిపోదేనే తాను భావిస్తున్నానని మంత్రి కొండ్రు మురళీ వేరుగా అన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరినట్లు చెప్పారు.

పార్థసారథిని అడ్డుకున్న వైయస్సార్ కాంగ్రెసు

మంత్రి పార్థసారథిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డుకుంది. కృష్ణా జిల్లా కైకలూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్థసారథిని జగన్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే మద్దతివ్వం: దత్తాత్రేయ

హైదరాబాదు నగరం పైన ఎలాంటి ఆంక్షలు పెట్టినా, కేంద్రపాలిత ప్రాంతం చేసినా తమ పార్టీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మెదక్ జిల్లాలో అన్నారు.

English summary

 Government whip Jagga Reddy on Tuesday said Medak district ministers were appealed CM Kiran Kumar Reddy to postopone Rachabanda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X