వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రులు వంగలపూడి అనిత, సవిత షాకింగ్ కామెంట్స్!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు పైన ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది .తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు పైన ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్ట్ సక్రమమేనని ఆమె పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ లో తనకు కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

వంశీ అరెస్ట్ పై హోం మంత్రి అనిత ఏమన్నారంటే
వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని కేసులు పెట్టి అరెస్టు చేసే విషయంలో జాగ్రత్తగానే పోలీసులు వ్యవహరిస్తారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇక వైసిపి నేతలు ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెబుతున్నారని నిన్న డీజీపీ బిజీగా ఉండొచ్చు అంతమాత్రాన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. అయినా ఈ ఎనిమిది నెలల్లో వైసినేతలు డిజిపిని ఎన్నిసార్లు కలవలేదో చెప్పాలన్నారు.

Ministers Vangalapudi Anitha and Savitha shocking comments on Vallabhaneni Vamsi arrest

హోం శాఖకు ప్రత్యేకంగా కేటాయింపులపై వంగలపూడి అనిత
ఇక ఇదే సమయంలో విజయనగరంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఎస్ఓ బుల్లెట్ బ్యాగ్ మిస్ కావడం దురదృష్టకరమని దానిపై విచారణ కొనసాగుతుందని వంగలపూడి అనిత వెల్లడించారు. అయితే బడ్జెట్లో ప్రజల రక్షణే ప్రాధాన్యతగా హోం శాఖకు ప్రత్యేకంగా కేటాయింపులు రానున్నాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టడం పైన ప్రత్యేక కసరత్తు చేస్తున్నామన్నారు.

వంశీ అరెస్ట్ పై స్పందించిన మంత్రి సవిత
గత ప్రభుత్వం హోంశాఖకు సంబంధించి 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కన పెట్టిందని ఇప్పుడు తమ హయాంలో 73 పథకాలను పునరుద్ధరించామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇదిలా ఉంటే వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు పైన మంత్రి సవిత స్పందించారు. టిడిపి పార్టీ ఆఫీస్ పై దాడి చేయడం కేసు పెట్టిన వారిని బెదిరించడం వంటి చర్యలు దారుణమని ఆమె మండిపడ్డారు.

మహిళలను అవమానించిన రాజ్యాలే కూలిపోయాయి: మంత్రి సవిత
అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని ఘోరంగా అవమానించారని గుర్తుచేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సవిత పేర్కొన్నారు. అసెంబ్లీలో నాటి సీఎం పైసాచిక ఆనందం పొందారని, మహిళలను అవమానించిన రాజ్యాలే కూలిపోయాయని దీనికి మన పురాణాలే సాక్ష్యమని మంత్ర సవిత గుర్తు చేశారు. జగన్ చెల్లిని, తల్లిని ఎన్నికల్లో వాడుకొని వదిలేసాడని బాబాయి పై గొడ్డలి వేటు వేశాడని మంత్రి సవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలకు సైతం నాడు అన్యాయం చేశాడని మంత్రి సవిత టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+