బాలికపై రేప్: వ్యక్తి చంపేసి తల పట్టుకెళ్లారు
విశాఖపట్నం: విశాఖపట్టణంలోని గాజువాకలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నూకరాజు అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై న్యూపోర్టు పోలీసు స్టేషన్లో పోస్కో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అదలావుంటే, విశాఖపట్టణం జిల్లాలోని జి.మాడుగుల మండలం కుర్తాడలో సోమవారం ఉదయం దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, ఆ తర్వాత తలను తీసుకెళ్లారు. మృతుడిని పోతురాజుగా గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
మద్యం మత్తులో రైలు కింద పడ్డాడు
కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం సింగవరంలో మద్యం మత్తులో రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి కాళ్లు తెగిపోయాయి. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొండుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అత్తాకోడళ్లపై దాడి, చోరీ
కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం కొండూరులో సోమవారం ఉదయం దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న అత్తాకోడళ్లపై గొడ్డలితో దాడి చేసి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. దాడిలో తీవ్రంగా గాయపడిన లావణ్య, జానకి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఓ ఇంట్లో చోరీ
తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలం మాచవరంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో రూ.1.20 లక్షలు, 25 కాసుల బంగారం చోరీకి గురైందని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications