మిత్రులతో కలిసి ప్రేయసిపై రేప్: తాగుడికి తల్లి హత్య

అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక నిందితులపై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే బాలిక చెబుతున్న వివరాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో తాగుడుకు డబ్బులివ్వలేదనే కోపంతో తల్లిని కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ సంఘటన షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోతుగల్ గ్రామానికి చెందిన ముక్కిరి సత్యమ్మ (60) కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేది. కొద్దిరోజుల క్రితం భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు బాలకిష్టయ్య, చిన్న కుమారుడు ఆశోక్, ఒక కుమార్తె ఉంది. అందరికీ పెళ్లిలయ్యాయి.
చిన్న కుమారుడు ఆశోక్ తల్లి వద్దే ఉండేవాడు. తల్లి కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషించేది. కాగా అశోక్ ఏ పని చేయకుండా తాగుడుకు బానీసయ్యాడు. తరుచూ తాగుడుకు డబ్బులివ్వమని తల్లిని వేధించేవాడు. నెలరోజుల క్రితం తల్లి సత్యమ్మకు ఉపాధి హామీ పథకంలో కూలిపనిచేయగా రూ.1500 వచ్చాయి. నాకు అప్పులు రూ.15 వేలు ఉన్నాయనీ, తాగుడుకు డబ్బులివ్వాలని రోజు వేధించేవాడు. పెళ్లి చేస్తేనన్నా ఏదైనా పని చేసుకుని బతుకుతాడేమోనని అనుకుంటే అతడితో పాటుగా భార్యను కూడా ఏ పని చేయనివ్వకుండా ఇంటి వద్దే ఉంటూ తల్లి తెచ్చే కూలీ డబ్బులతోనే సంసారం నడిపించేది.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం భార్యను పుట్టింటికి పంపించి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రాత్రి ఇంట్లో నిద్రపోతున్న తల్లిని డబ్బులివ్వమని అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం షాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తల్లిని హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. మృతురాలి పెద్ద కుమారుడు బాలకిష్టయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications