ప్రేమించి కోరిక తీర్చుకొని కాదన్నాడు...బాధితురాలు ఏం చేసిందంటే

ప్రేమ పేరుతో మోసం చేసి కోరిక తీర్చుకొని వదిలేయడంతో అవమానం భరించలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకొంది.

గుంటూరు :ప్రేమించానన్నాడు. కోరిక తీర్చుకొన్నాడు. అవసరం తీరిందని భావించిన తర్వాత కాదు పొమ్మన్నాడు.రాజీ చేసుకొనేందుకు రమ్మని కబురు పంపి మరోసారి తన కోరిక తీర్చుకొన్నాడు. మోసపోయాయని గుర్తించిన మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మరణానికి కారణమైన నిందితుడు ఏసుబాబుకు కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.

గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని మల్లాదికి చెందిన పద్యాల ఏసుబాబు కూలీ పనులు చేసేవాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలకి కూడ కూలీ పనులకు వెళ్ళేది. ప్రతి రోజూ కూలీ పనులకు అతనితో కలిసి రాజమండ్రికి వెళ్ళేది.దీంతో వారిద్దరి మద్య చనువు పెరిగింది.

minor girl sucide in guntur distirct

ఈ చనువుగా ఆసరాగా చేసుకొన్నాడు. ప్రేమిస్తున్నానని ఆమెకు మాయమాటలు చెప్పాడు.కోరిక తీర్చుకొన్నాడు. పెళ్ళి చేసుకొంటానని ఆమెను నమ్మించాడు.ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. చివరికి ఆ బాలికను మోసం చేశాడు. మరో యువతితో వివాహనికి సిద్దమయ్యాడు. ఆలస్యంగా మైనర్ బాలికకు ఏసుబాబు మరోక యువతితో వివాహనికి సిద్దమైన విషయం తెలిసింది. ఈ విషయమై ఆమె అభ్యంతరం తెలిపింది. అయితే తన వివాహానికి ఆమె అడ్డురాకుండా ఉండాలని భావించాడు.

2014 అక్టోబర్ 10వ, తేదిన విజయవాడలో ఉన్న మైనర్ బాలికను తన స్నేహితులతో అమరావతికి పిలిపించాడు. అక్కడ నుండి తన స్నేహితులైన బాజి, గోపి ల సహాకారంతో తమ్మవరంలో ఆమెతో గడిపాడు ఏసుబాబు.ఏసుబాబు స్నేహితులు ఆమెను ఇంటి వద్ద దింపారు. ముగ్గురు కలిసి తనను మోసగించారని మైనర్ బాలిక అర్థం చేసుకొంది . కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొంది.అదే సంవత్సరం అక్టోబర్ 18వ, తేదిన ఆమె మరణించింది.ముగ్గురు నిందితులపై ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయడంతో ఏసుబాబుకు జీవిత ఖైదు, 20 వేల జరిమానా, అతనికి సహకరించిన ఇద్దరికి పదేళ్ళ జైలు శిక్ష 5వేల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీనివాస్ తీర్పు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+