డాక్టర్ నిర్లక్ష్యం: కడుపులో కాటన్ పెట్టి మర్చిన డాక్టర్

నెల్లూరు : వైద్యులను దేవుడిగా భావిస్తార.. కొందరు డాక్టర్లు వ్యవహరించే తీరు మొత్తం డాక్టర్ల వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉంది. కొందరు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహారించి రోగుల ప్రాణాల మీదికి తెస్తున్నారు. ఇళాంటి ఘటన ఒకటి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొంది.

నెల్లూరు జిల్లాలో డెలివరీ కోసం వచ్చిన శ్రావణి అనే మహిళకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు కడుపులోనే కాటన్ ను మర్చిపోయారు. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లే ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకొంది.నెల్లూరు జిల్లా నవాబుపేటలోని ఓ ప్రేవేట్ నర్సింగ్ హోం లో ఈ ఘటన చోటుచేసుకొంది.

నెల్లూరు నవాబు పేటలో జూలై14 వ, తేదిన శ్రావణి అనే మహిళ డెలివరీ కోసం సులోచన నర్సింగ్ హోం లో చేరింది. ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.కడుపులో కాటన్ వేసి కుట్లు వేశారు.

mistakenly put cotton in a lady stomach

ఆపరేషన్ జరిగిన తర్వాత నుండి ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాదపడుతున్నారు. అక్టొబర్ 25వ, తేదిన ఆమె నెల్లూరులోని సింహాపురి స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ చేస్తే కడుపులో పె్ద మొత్తంలో దూది ఉన్న విషయాన్ని గుర్తించారు.

వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న దూదిని తొలగించారు.ప్రాణాల మీదికి తెచ్చిన డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సులోచనమ్మ నర్సింగ్ హోం ఎదుట భాదితుల కుటుంబసభ్యులు శనివారం నాడు ధర్నా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+