వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్! మీ నాన్నే గుర్తుపెట్టుకో, మా ఎంపీలు డిస్‌క్వాలిఫై కాకుండా కుమ్మక్కు: మిథున్ రెడ్డి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ ఎంపీలు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్న, వారికి అవార్డులు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ 6వ తేదీన తాము రాజీనామా చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమతో కలిసి రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చేదని చెప్పారు.

Recommended Video

రాజీనామాలు : వైసీపీ ఎంపీలకు స్పీకర్ లేఖ!

ఎయిర్ఏషియా స్కాం: 'అక్రమ మార్గంలో పనుల కోసం చంద్రబాబును కలిస్తే చాలు!'ఎయిర్ఏషియా స్కాం: 'అక్రమ మార్గంలో పనుల కోసం చంద్రబాబును కలిస్తే చాలు!'

కానీ టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా, రాకపోయినా తాము రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ రాజీనామాలను రేపు (బుధవారం) ఆమోదిస్తారని భావిస్తున్నామని చెప్పారు. ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నీతి, నిజాయితీల గురించి మాట్లాడే ముందు తమ గురించి ఆలోచించాలని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేయడంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఓటుకు నోటు తర్వాత హైదరాబాద్ నుంచి పారిపోయారు

ఓటుకు నోటు తర్వాత హైదరాబాద్ నుంచి పారిపోయారు

ఓటుకు నోటు కేసు బయటపడిన తర్వాత కొందరు హైదరాబాద్ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా ఎంపీలు కనీసం ప్రమాణ స్వీకారం చేయకముందే మీ తండ్రి (చంద్రబాబు) వారిని కొనుగోలు చేశారని మిథున్ రెడ్డి మంత్రి నారా లోకేష్‌కు కౌంటర్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేలను 23 మందిని మీ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. ఎయిర్ ఏషియా స్కాంలో దొరికిన టేపుల్లో చంద్రబాబు పేరు ఉన్నట్లు సీబీఐ దర్యాఫ్తులో తేలిందన్నారు. మీ పద్ధతి ఇలా ఉంటే మీరు మాకు సుద్దులు చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

మా ఎంపీలు టీడీపీలో చేరితే డిస్‌క్వాలిఫై కాకుండా బీజేపీతో కుమ్మక్కు

మా ఎంపీలు టీడీపీలో చేరితే డిస్‌క్వాలిఫై కాకుండా బీజేపీతో కుమ్మక్కు


మా రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు సరేనని, టీడీపీలో చేరిన ఎంపీలు కనీసం డిస్‌క్వాలిఫై కాకుండా బీజేపీతో చంద్రబాబే కుమ్మక్కు అయ్యారని ధ్వజమెత్తారు. అసలు ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందో మీ నాన్న దగ్గర నిజాయితీగా తెలుసుకోవాలని మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎయిర్ ఏషియా స్కాంలో చంద్రబాబు పేరు రావడంతో సీబీఐ విచారణను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. తాము రాజీనామాలు చేసి రెండు నెలలు అవుతుంటే నిన్న మొన్నా చేసినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ రాజీనామాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

అవిశ్వాసంపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు

అవిశ్వాసంపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాం, మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీని కోరితే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక హోదాతో ఏపీకి మేలు జరుగుతుందని చెప్పినా వినలేదన్నారు. హోదా కోసం టీడీపీతో కలిసి పని చేస్తామని కూడా చెప్పామన్నారు. రాజీనామాలు చేయమని నిలదీస్తే పారిపోయింది టీడీపీనే అన్నారు. 25 మంది ఏపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చేదన్నారు.

లోకేష్! ఈ విషయం గుర్తు పెట్టుకో

లోకేష్! ఈ విషయం గుర్తు పెట్టుకో

నాలుగేళ్లలో చంద్రబాబు ఏపీకి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని మిథున్ రెడ్డి నిలదీశారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ లోకేష్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది మీ నాన్న చంద్రబాబే అన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని లోకేష్ మాట్లాడాలన్నారు. నూటికి నూరుపాళ్లు మా రాజీనామాలు ఆమోదం పొందుతాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాడుతోందన్నారు.

English summary
YSRCP MP Mithun Reddy counter to Minister Nara Lokesh over resignations. He names Cash for Vote and AirAsia Scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X