జగన్ కు సవాల్ విసిరిన స్టాలిన్-కేంద్రంపై పోరుకు ఇదే మంచి తరుణం-స్వీకరిస్తారా ?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలు నెరుపుతున్న సీఎం జగన్ రెండేళ్లుగా అదే స్ధాయిలో సాయం మాత్రం పొందలేకపోయారు. మోడీ సర్కార్ కు ప్రతీసారీ బేషరతుగా మద్దతిస్తున్నా .. ఏపీ ప్రయోజనాల్ని మాత్రం సాధించుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీకి గుడ్ బై చెప్పేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఆ మధ్య బీజేపీ వైఖరిని ఎండగట్టాలని జగన్ పిలుపునివ్వడంతో మంత్రులు, సలహాదారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీకి జగన్ గుడ్ బై చెప్పేందుకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంచి అవకాశం కల్పించారు.

బీజేపీతో జగన్ సంబంధాలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందు వరకూ బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉన్న సీఎం జగన్.. 2019లో అధికారంలోకి వచ్చాక మాత్రం కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో అంటకాగడం మొదలుపెట్టారు. సీఏఏ, ఎన్నార్సీ వంటి వివాదాస్పద అంశాల్లో బీజేపీ తీసుకున్న నిర్ణయాలతో ఇరుకునపడినా పట్టించుకోలేదు. అంతే కాదు కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లుల విషయంలోనూ అడక్కుండానే మద్దతిచ్చి మరీ ఇతర రాష్ట్రాల దృష్టిలో జగన్ చులకన అయ్యారు. ఇంత చేస్తున్నా బీజేపీ నుంచి మాత్రం సహకారం కరువైంది. ప్రతీ బడ్జెట్ లో అన్యాయం చేయడమే కాకుండా విభజన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. దీంతో బీజేపీ-జగన్ సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి.

జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏమాత్రం సాయం చేయకపోయినా తన వ్యక్తిగత అవసరాల కోసమే ఆ పార్టీతో స్నేహం చేస్తున్నారన్న విమర్శలు జగన్ పై అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. అడక్కపోయినా పలు అంశాల్లో బేషరతుగా మద్దతు ప్రకటించడం, ప్రతీసారీ ఛీత్కారాలు ఎదురవుతున్నా బీజేపీని వదలకపోవడం వంటి చర్యలతో జనంలో జగన్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతోంది. దీంతో సీఎం జగన్ పైనా కేంద్రానికి దూరం కావాలన్న ఒత్తిడి పెరుగుతోంది. గతంలో వ్యవసాయ చట్టాలపై కేంద్రాన్ని ఇరుకునపెట్టే అవకాశం వచ్చినా దూరం చేసుకుని అందరి కంటే ముందు అండగా నిలిచిన జగన్ కు ఇప్పుడు తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా వచ్చింది.

కేంద్రంపై పోరులో స్టాలిన్ ముందడుగు
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సత్సంబంధాలు నెరుపుతున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై పోరుకు తాజాగా ముందడుగు వేశారు. కేంద్రం గతంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న స్టాలిన్.. తాజాగా రెండు రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీలో వీటికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో కేంద్రంపై ఆయన పోరాటం మొదలైనట్లయింది. విపక్ష కాంగ్రెస్ తో కలిసి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన స్టాలిన్.. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ విషయంలో వేస్తున్న అడుగులు దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా సీఎంలలోనూ ఆలోచన రేపుతున్నాయి. దీంతో ముఖ్యంగా జగన్ సర్కార్ కూడా వీటిని నిశితంగా గమనిస్తోంది.

జగన్ కు సవాల్ విసిరిన స్టాలిన్
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన డీఎంకే అధినేత స్టాలిన్ ఇప్పుడు కేంద్రంతో పాటు సీఎం జగన్ కు కూడా సవాల్ విసిరారు. కేంద్రంపై పోరాటం కోసం తాము సిద్ఘంగా ఉన్నామని, తమతో కలిసి వచ్చే వారు ఎవరంటూ స్టాలిన్ విసురుతున్న సవాల్ కు జగన్ సర్కార్ వద్ద ప్రస్తుతానికి సమాధానం లేదు. దీంతో స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై జగన్ సర్కార్ మౌనంగా ఉండిపోతోంది. వైసీపీ నేతలు కూడా స్టాలిన్ నిర్ణయంపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. బీజేపీపై తాజాగా సమర శంఖారావం పూరించినట్లు హడావిడి చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు స్టాలిన్ నిర్ణయాన్ని సమర్ధించే విషయంలో మాత్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

జగన్ సవాల్ స్వీకరిస్తారా ?
కేంద్రంపై పోరాటంలో భాగంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు సీఎం ఎంకే స్టాలిన్. తద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సవాల్ విసిరినట్లయింది. ప్రస్తుతం వైసీపీ అధినేత ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో తమిళనాడు తరహాలోనే ఏపీ అసెంబ్లీలో జగన్ కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అయితే వైసీపీ సర్కార్ మాత్రం ఆ విషయంలో ముందడుగు వేసే పరిస్ధితి కనిపించడం లేదు బీజేపీతో పోరాటం ముఖ్యమే అయినా ఇప్పుడున్న పరిస్ధితుల్లో కేంద్రంపై పోరుకు సిద్ధం కావడం వైసీపీకి కానీ, జగన్ కు కానీ అస్సలు ఇష్టం లేదు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ సర్కార్ కు పూర్తిగా సాయం ఆగిపోతుందన్న భయాలే ఇందుకు కారణం.
Recommended Video

విజయన్, స్టాలిన్ చేసింది జగన్ చేయలేరా ?
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఇప్పటికే వ్యతిరేకించాయి. రెండు అసెంబ్లీల్లోనూ తీర్మానాలు చేసి సీఎంలు విజయన్, స్టాలినా్ కేంద్రానికి పంపారు. ఇక దక్షిణాదిలో మిగిలింది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక. కర్నాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాగో ఆ పని చేయలేదు. ఇక మిగిలింది జగన్, కేసీఆర్. వీరిలో కేసీఆర్ కూడా వ్యవసాయ చట్టాలపై మాటలే తప్ప చేతల్లో వ్యతిరేకించేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది. చివరిగా మిగిలింది జగన్ మాత్రమే. ఇప్పటికే పార్లమెంటులో వ్యవసాయ చట్టాలకు అండగా నిలిచిన జగన్ ఇప్పుడు వాటిని తమ అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే రాజకీయంగా విమర్శలు తప్పవన్న ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకించకుండా కేంద్రంపై కానీ, బీజేపీపై కానీ పోరాటం పేరుతో హంగామా చేస్తే అదెంతో కాలం జనం నమ్మేలా లేరు. దీంతో రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు జగన్ ను కచ్చితంగా ఇరుకునపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications