ఆ వంద మందిని తోలుతీస్తా - అఖిలప్రియ మాస్ వార్నింగ్..!!
ఏపీలో రెడ్ బుక్ రాజకీయం సంచలనంగా మారుతోంది. లోకేష్ రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారికి శిక్ష తప్పదని పదే పదే హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అఖిల ప్రియ సైతం రెడ్ బుక్ పేరుతో హెచ్చరికలు చేస్తున్నారు. తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో ఉన్న వంద మంది తోలుతీస్తానని హెచ్చరించారు. ఎవరినీ వదలి పెట్టను అంటూ అఖిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అఖిల సంచలనం
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ తన ప్రత్యర్ధులకు హెచ్చరిక చేసారు. తన వద్ద కూడా రెడ్ బుక్ ఉందన్నారు. అందులో వంద మంది పేర్లు ఉన్నాయని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వారి తోలు తీస్తామని ఎన్నికల ముందే చెప్పానని గుర్తు చేసారు. ఇప్పుడు వారిని వదిలేది లేదని హెచ్చరించారు. తాను సౌమ్యంగా ఉంటానని అనుకోవద్దని..వారి లెక్కలు తేల్చటం ఖాయమని స్పష్టం చేసారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా మందిపైన తప్పుడు కేసులు పెట్టి వేధించిందని విమర్శించారు.

రెడ్ బుక్ - హెచ్చరిక
తనను ఇబ్బంది పెట్టిన వంది మంది తన రెడ్ బుక్ లో ఉన్నారని అఖిల వెల్లడించారు. ఇప్పుడు తన కారణంగా ఆ వంద మంది ఇబ్బందులు పడటం ఖాయమన్నారు.వారి పైన లీగల్ గా కేసులు పెట్టిస్తానని స్పష్టం చేసారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. డిగ్రీ కాలేజీ తీసుకువచ్చానని బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకుంటున్నారని.. కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేవని విమర్శించారు. టాయిలెట్స్ కూడా సరిగా లేవన్నారు. స్వీపర్స్ చేయాల్సిన పనులు కూడా విద్యార్థులే చేసుకుంటున్నారని చెప్పారు.
ఆ వంద మంది తోలు తీస్తా..అఖిలాప్రియా మాస్ వార్నింగ్..!!#BhumaAkhilaPriya #AkhilaPriya #TDP #YSRCP #Allagadda #AndhraPradesh pic.twitter.com/f0aHMj9rJH
— oneindiatelugu (@oneindiatelugu) September 7, 2024
టార్గెట్ వైసీపీ
గంగుల బిజేంద్రారెడ్డి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. కేవలం ఓటరువి మాత్రమేనని వ్యాఖ్యానించారు. తాను అక్రమ వసూళ్లు చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణల పైన స్పందించారు. ఈ ఆరోపణల పైన బహిరంగ చర్చకు మీడియా సమక్షంలోనే సిద్దమని సవాల్ చేసారు. ఇక..కర్నూలు జిల్లాలో మారుతున్న ప్రస్తుత రాజకీయ సమీకరణాల వేళ అఖిలప్రియ చేసిన హెచ్చరిక రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications