జెడ్పీటీసీతో ఎమ్మెల్యే అనిత వాగ్వాదం, అలిగి అక్కడి నుంచి వెళ్లారు
విశాఖ: విశాఖపట్నంలోని కోటవురట్ల మండలం జుల్లూరు జెడ్పీ హైస్కులులో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. జెండా ఆవిష్కరణలో ఎమ్మెల్యే అనిత, జెడ్పీటీసీ వెంకటలక్ష్మిల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో జెడ్పీటీసీ కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హైదరాబాద్‌లో వెంకయ్య జెండావిష్కఱణ
తెలంగాణలోని హైదరాబాదులో గల బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మహాత్ముడి విగ్రహానికి అవమానం
భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్మా గాంధీకి గుంటూరు జిల్లాలోని పిట్టవానిపాలెం అలకాపురం శివారులో అవమానం జరిగింది. శివారు రహదారి పక్కన గాంధీజీ విగ్రహం రోడ్డు పక్కన పడి కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు దీనిని పగులగొట్టి నిర్లక్ష్యంగా రోడ్డుపై పడేశారు. అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications