చెరువు కట్టపైనే చెవిరెడ్డి స్నానం - నిద్ర : హమాలీగా మారి బస్తాలు మోస్తూ: అన్నీ తానై ..!!
వరుసగా కురిసిన భారీ వర్షాలు...వరదలతో చిత్తూరు జిల్లా అతలాకుతలం అయింది. తిరుమల - తిరుపతిని వరద నీరు ముంచెత్తింది. శ్రీవారి మాడ వీధుల్లోకి వరద నీరు చేరింది. తిరుపతి నగరంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ఉంది. ఇక, కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవటంతో భారీ నష్టం జరిగింది. చిత్తూరు జిల్లాలో రాయల చెరువు నిండి..లీకేజీ జరిగింది. తెగి పడితే దాదాపు 30 గ్రామాలు మునిగే ప్రమాదం ఉంది. దీంతో..జిల్లా అధికారులు పూర్తిగా ఆ చెరువు పరిస్థితి పైనే ఫోకస్ పెట్టారు.

చెరువు కట్టపైనే చెవిరెడ్డి మకాం
సమీప గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. అదే సమమంలో రాయల చెరువు టెన్షన్ పడుతున్న వేళ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి చెరువు కట్టపైనే మకాం వేసారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడే ఉంటూ లీకేజీ నియంత్రణ పనులను పర్యవేక్షించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం అక్కడే బస చేసారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి రెండు రోజులు పూర్తిగా చెరువు కట్టపైనే గడిపారు. ఆయన బహిరంగ ప్రదేశంలోనే స్నానం చేస్తూ అందుబాటులో ఉన్న ఆహారం తీసుకున్నారు. అక్కడే నిద్రించారు.

బస్తాలు మోస్తూ..సహాయక చర్యల్లో
వరద ముంపు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హమాలీగా మారి బస్తాలను మోసారు. విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని 11 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్ ద్వారా వచ్చాయి. ఆ బస్తాలను చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్ నుంచి కిందకు దించి ముంపు బాధితులకు అందజేశారు. వరద ముంపు నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని, చెరువుకు గండి పడినా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకూడదనేది సీఎం జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు.

చెరువు కట్ట పైనే స్నానం.. నిద్ర
ఇప్పటికే 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చినట్టు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి..జిల్లా అధికారులు సైతం అక్కడకు వచ్చి పరిస్థితులను ఆరా తీసారు. కట్ట నుంచి లీకేజీ వచ్చిందని తెలిసిన వెంటనే దాదాపు 30 గ్రామాల ప్రజలు సురక్షితప్రాంతాలకు వెళ్లి, ఇంకా భయంగుప్పిట్లోనే ఉన్నారు. అయితే, క్రమేణా వర్షాలు - వరద నీరు తగ్గటంతో ముంపు ముప్పు తొలిగినట్లుగా చెబుతున్నారు.
Recommended Video

తిరుపతిలో బాధితులకు పునరావాసం
అయితే, తాజాగా తిరిగి అల్పపీడనం ఏర్పుడుతోందని.. తిరిగి 26వ తేదీ నాటికి చిత్తూరు జిల్లాలో మరోసారి భారీ వర్షాలకు అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీని పైన ఈ రోజున ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లతో వర్చ్యువల్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక, చెవిరెడ్డి 18 గ్రామాలు ఖాళీ చేయించి తిరుపతిలో పునరావసం కల్పించారు. అక్కడ అన్నీ తైనా రాయల చెరువు వద్ద చేసిన సేవా కార్యక్రమాల పైన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.
-
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications