పబ్లిక్‌లో రెచ్చిపోయిన జగన్ పార్టీ ఎమ్మెల్యే, ఇలాంటి వారు వద్దని బాబు
కర్నూలు జిల్లా తంగడంచలో బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య బహిరంగ సభ సాక్షిగా వాగ్యుద్ధం జరిగింది.
కర్నూలు: కర్నూలు జిల్లా తంగడంచలో బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య బహిరంగ సభ సాక్షిగా వాగ్యుద్ధం జరిగింది.
ఈ రోజు చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే ఐజయ్య రెచ్చిపోయి మాట్లాడారు.

మైక్ కట్
ఐజయ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ప్రసంగం చేస్తుండటంతో అధికారులు ఆయన మైక్ కట్ చేశారు.

ఇలా విమర్శలు
ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ సహా మరిన్ని నిధులు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. భూములు తీసుకొని ఏం చేస్తారో చెప్పడం లేదని మండిపడ్డారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదన్నారు.

చంద్రబాబు ఆగ్రహం
వైసిపి ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఈ ప్రాంతం ఎప్పటికీ అభివృద్ధి చెందదని మండిపడ్డారు. ఎప్పటికి కూడా వెనుకబడే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఫ్యూడల్ మనస్తత్వం..
ఫ్యూడల్ మనస్తత్వంతో కొందరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. మైక్ ఇస్తే ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేసుకోవడం సరికాదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ఇలాంటి ఎమ్మెల్యేల మాటలు ప్రజలు పట్టించుకోవద్దన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications