వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్సెస్ కలెక్టర్: దళిత సంఘాల ఛలో ధర్మవరం; వైసీపీ ఎమ్మెల్యే ఇంటివద్ద భారీ భద్రత

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల తీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఒక ఎమ్మెల్యే జర్నలిస్టులను బెదిరిస్తే, మరో ఎమ్మెల్యే ఏకంగా కలెక్టర్ నే టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసే ఎమ్మెల్యేలు కొందరైతే, వర్గ పోరు తో గొడవలు పడుతున్న నేతలు మరికొందరు. ఇక ఈ పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి చిరాకు తెప్పిస్తున్నాయి.

 ఏపీలో కరోనాపై జగన్ సర్కార్ అలెర్ట్ .. 15రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, స్పీడ్ గా వ్యాక్సినేషన్ ఏపీలో కరోనాపై జగన్ సర్కార్ అలెర్ట్ .. 15రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, స్పీడ్ గా వ్యాక్సినేషన్

కలెక్టర్ గంధం చంద్రుడిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కలెక్టర్ గంధం చంద్రుడిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గంధం చంద్రుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పనికిమాలిన కలెక్టర్ ను తానెప్పుడూ చూడలేదని, ఎమ్మెల్యేలను వెధవలను చూసినట్లు చూస్తున్నాడని, చివరకు మంత్రులను కూడా వెధవలను చూసినట్లు చూస్తున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 దళితుల ఆగ్రహం .. ఛలో ధర్మవరానికి పిలుపునిచ్చిన దళిత సంఘాలు

దళితుల ఆగ్రహం .. ఛలో ధర్మవరానికి పిలుపునిచ్చిన దళిత సంఘాలు

జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు దళితులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

దీంతో జిల్లా కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి రామచంద్రారెడ్డి పై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. దళితులను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని దళిత సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చలో ధర్మవరానికి దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఛలో ధర్మవరం నేపధ్యంలో కేతిరెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు

ఛలో ధర్మవరం నేపధ్యంలో కేతిరెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు


కేతిరెడ్డి నివాసాన్ని ముట్టడించాలి అన్న దళిత సంఘాల పిలుపు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేతిరెడ్డి నివాసం వైపు వెళ్లే అన్ని రహదారులపై బారికేడ్ల ను ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. దళిత సంఘాల చలో ధర్మవరం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. స్థానిక
దళిత సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తున్నారు .

కేతిరెడ్డి వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ .. నేడు ఛలో ధర్మవరం

కేతిరెడ్డి వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ .. నేడు ఛలో ధర్మవరం

ఇప్పటికే కలెక్టర్ ను పరుష పదజాలంతో దూషించిన వ్యవహారంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువగా మారాయి. కలెక్టర్ పై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలు సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశాయి . పోలీస్ స్టేషన్లో కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేయడం చేసిన దళిత సంఘాలు ఇక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించాలని చలో ధర్మవరంకు పిలుపునిచ్చాయి.

మరి ఈ వివాదం చివరకు ఏ రూపు తీసుకుంటుందో వేచి చూడాలి .

English summary
MLA Kethireddy Venkatramireddy's remarks on District Collector Gandham Chandradu have angered Dalits. In this context, the Dalit community today called for Chalo Dharmavaram. This created a tense situation in Dharmavaram. Police were heavily deployed at the residence of MLA Kethireddy Venkatramireddy following a call from Dalit groups to storm Kethireddy's residence. police set up barricades on all roads leading to the residence and is controlling traffic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X