డప్పు కొట్టి స్టెప్పులేసిన రోజా .. ఎమ్మెల్యే రోజా దరువుతో కళాకారుల్లో జోష్ !!

నగిరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఏం చేసినా సంచలనమే. లాక్ డౌన్ సమయం లో కరోనా మహమ్మారి కట్టడికి విధులు నిర్వర్తించిన వారికి స్వయంగా వంట చేసి పెట్టిన రోజా ఏది చేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో అంబులెన్సు నడిపిన రోజా, ఆ తర్వాత దిశ స్కూటర్లను నడిపి సందడి చేశారు. ఇప్పుడు తాజాగా డప్పు కళాకారులతో కలిసి డప్పు కొడుతూ ఎమ్మెల్యే రోజా అందరినీ ఆకట్టుకున్నారు.

డప్పు కొట్టి సందడి చేసిన నగరి ఎమ్మెల్యే రోజా

డప్పు కొట్టి సందడి చేసిన నగరి ఎమ్మెల్యే రోజా


నగరి శాసనసభ్యురాలు రోజా డప్పు కొట్టి సందడి చేశారు. అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు. పుత్తూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన డప్పు కళాకారులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రోజా డప్పు కళాకారులు అందరికీ డప్పులను అందించి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఆదరిస్తుంది అని స్పష్టం చేశారు. కులవృత్తులను, కళాకారులను ఆదుకోవడం కోసం జగన్ సర్కార్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు రోజా.

డప్పు కళాకారులకు పరికరాలు అందించి డప్పు కొట్టి స్టెప్పులేసిన రోజా

డప్పు కళాకారులకు పరికరాలు అందించి డప్పు కొట్టి స్టెప్పులేసిన రోజా

72 మంది డబ్బు కళాకారులకు మంజూరు చేసిన డప్పు, డ్రెస్, గజ్జలు, డప్పు కర్రలు, పై పంచ తదితర పరికరాలను అందించారు ఎమ్మెల్యే రోజా. ఆ తర్వాత డప్పు కళాకారులతో కలిసి తానే స్వయంగా డప్పు కొట్టి వారిలో ఉత్సాహాన్ని నింపారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కళాకారుల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారని రోజా స్పష్టం చేశారు. రోజా తమతో కలిసి డప్పు కొట్టడంతో కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఆడి పాడి స్టెప్పులేశారు.ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కళాకారులు తమ జీవితాన్ని అందంగా మలచుకోవాలని రోజా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో రోజా

నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో రోజా

ఆ తర్వాత నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల మళ్ళీ నియోజక వర్గ అభివృద్దిపై దృష్టి సారించిన రోజా మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను తీసుకోవాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని రోజా ఆకాంక్షించారు. ఎమ్మెల్యే రోజా పాదిరేడు .. ఎల్ఎం కండిగ వయా తట్నేరి నుండి తట్నేరి దళితవాడ రోడ్డు నిర్మాణానికి చొరవ చూపి ఆసియా భివ్రుద్ది బ్యాంకు ద్వారా రోడ్డు నిర్మాణం చేయించారు .దీంతో స్థానికులు ఎమ్మెల్యే చొరవకు కృతజ్ఞతలు తెలిపి ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమెపై పూల వర్షం కురిపించి సత్కరించారు. ఏ పని చేసినా అందరి అభిమానాన్ని చూరగొనటం, ప్రత్యేకతను సంతరించు కోవడం ఎమ్మెల్యే రోజా విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+